Korean Kanakaraju:వరుణ్ తేజ్.. హిట్స్ కి నాకు చాలా దూరం అంటూ ప్లాపులతోనే తెగ సావాసం చేస్తున్నాడు ఈ మెగా ప్రిన్స్.సినిమాలు చేస్తున్నాడు అన్నమాటే కానీ అన్ని బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తున్నవే.నిజానికి వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాల కన్నా వెరైటీ సినిమాలే ఎక్కువ.
ఇండో కొరియన్ హర్రర్ కామెడీ జోనర్లో
‘కంచె’ లాంటి పీరియడ్ డ్రామా అయినా,‘అంతరిక్షం’ లాంటి స్పేస్ థ్రిల్లర్ అయినా, ‘గద్దలకొండ గణేష్’ లాంటి మాస్ మేకోవర్ అయినావరుణ్ తేజ్ కే సొంతం.అయితే గత కొంతకాలంగా వచ్చిన ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లో లేకుండా పోయాడు.ఇక మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ తేజ్ సాలిడ్ కమ్ బ్యాక్ కావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.దీంతో ఎలాగైనా వరుస ప్లాప్ సినిమాలకి బ్రేక్ వేస్తానంటూ సరికొత్త సినిమాని పట్టాలెక్కించాడు ఈ మెగా ప్రిన్స్.అదే కొరియన్ కనకరాజు.(Korean Kanakaraju).
2026 ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్
టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటివరకు రాని ఒక డిఫరెంట్ ఇండో కొరియన్ హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుంది ఈ సినిమా.కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ’అంటూ ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.ఇక ఈ సినిమా 2026 ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేయడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.ఇక ఆగస్టు నెల సాధారణంగా సినీ ఇండస్ట్రీకి కలిసి వచ్చే సీజన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మేకర్స్ .ఇక ఈ సినిమాని ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.గాంధీ ఈసారి కొరియన్ కల్చర్ ని మన లోకల్ కామెడీ ఎలిమెంట్స్ కి ఎలా బ్లెండ్ చేస్తాడో చూడాలి .ఒక పక్క హర్రర్ సీన్లలో భయపెడుతూనే, మరోపక్క థియేటర్లో దద్దరిల్లేలా నవ్విస్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ .
సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్ఎస్ తమన్
ఇక వరుణ్ తేజ్ జోడీగా అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ నటిస్తుండగా, స్టార్ కమెడియన్ సత్య ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు .ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తుంది .ఇక ఈ సినిమాకి టాలీవుడ్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండడం విశేషం.హర్రర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టి-సిరీస్ సౌత్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, వంశీ, మనోజ్ రెడ్డికలిసి నిర్మిస్తున్నారు.ఇక స్టార్ డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉండటంతో ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోయాయి.
అసలే కొరియన్ సినిమాలకి ,వెబ్ సిరీస్ లకి ఇక్కడ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ .అలాంటి కొరియన్ బ్యాక్ డ్రాప్ లో మన నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కుతున్న ఈ కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో ఆగస్టు 7న బాక్సాఫీస్ వద్ద తేలిపోనుంది !