Prabhas Fauji:‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) ..డార్లింగ్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు బిజినెస్ వర్గాల్లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది.1940 కాలం నాటి హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ లో, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా పై అంచనాలు స్కై లెవెల్ లో పెట్టేసుకున్నారు మూవీ లవర్స్ .ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా పెరగడంతోపాటు ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమా క్రియేట్ చేసిన గ్లోబల్ రికార్డ్స్ ఈ ప్రాజెక్ట్ పై మరింత బిజినెస్ క్రేజ్ ని క్రియేట్ చేశాయి .మామూలుగా హను రాఘవపూడి సినిమా అంటే సీతారామం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ ఉంటుందని నమ్మకం, దానికి తోడు ప్రభాస్ లాంటి కటౌట్ యాడ్ అవ్వడంతో షూటింగ్ దశలోనే ఈ సినిమా సాలిడ్ థియేట్రికల్ డీల్స్‌ను క్లోజ్ చేసుకుందన్న టాక్ వినిపిస్తుంది.
అనిల్ తడానికి చెందిన ఏఏ ఫిలిమ్స్
ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేస్తూ ఫౌజీ హిందీ థియేటర్ రైట్స్ సాలిడ్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడవడం విశేషం.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ తడానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఏ ఫిలిమ్స్ (AA Films)ఈ రైట్స్ ని దక్కించుకున్నట్టు సమాచారం.గతంలో ప్రభాస్ నార్త్ ఇండియా మార్కెట్ ను శాసించిన బాహుబలితో పాటు ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలను కూడా అనిల్ తడానినే బాలీవుడ్లో డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం .ఇక అదే రిలేషన్ కంటిన్యూ చేస్తూ నార్త్ బెల్ట్ లోని మల్టీప్లెక్స్ లలో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టేలా ఇప్పటినుంచే సరికొత్త స్ట్రాటజీలని అమలు చేస్తుందట ఏఏ ఫిలిమ్స్.
also read:బంగారు పాత్రల్లో భోజనం.. చివరికి శవం కూడా దక్కని దౌర్భాగ్యం! మహానటి వెనుక ఉన్న చీకటి కథ!
థియేట్రికల్ రైట్స్ ని ‘హోంబాలే ఫిల్మ్స్’
మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసే పనిలో పడింది.అందులో భాగంగానే ఫౌజీ’ టోటల్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ని ‘హోంబాలే ఫిల్మ్స్’ దక్కించుకోవడం విశేషం.ప్రభాస్ తో ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ వంటి గ్లోబల్ హిట్ ని నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ కి ఓవర్సీస్ మార్కెట్లో ఉన్న బలమైన నెట్వర్క్ ఈ సినిమాకి మరింత ప్లస్ కానుందని చెప్పక్కర్లేదు.ఇందులో భాగంగానే ఓవర్సీస్ మార్కెట్లో అత్యంత కీలకమైన నార్త్ అమెరికా యూఎస్ఏ, కెనడా రీజియన్ లో ఈ సినిమాని ప్రత్యంగిరా సినిమాస్ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయబోతుంది గతంలో సలార్, కల్కి సినిమాలని నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్ లో కూర్చోబెట్టిన ప్రత్యంగిరా ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ చేయడంతో ఓవర్సీస్ లో ఫౌజి సినిమా మరిన్ని రికార్డులకి కేరాఫ్ గా నిలబడేలానే కనిపిస్తోంది .
రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో!
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్ సోషల్ మీడియా సెన్సేషన్, క్లాసికల్ డాన్సర్ ఇమాన్వి టాలీవుడ్లోకి ఎంట్రీస్తుండడం విశేషం.ఇక గ్లామర్ పరంగానే కాకుండా నటనకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కావడంతో ఈ సరికొత్త కాంబినేషన్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది.ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా నిర్మిస్తుండడం విశేషం. విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్న సంగీతం సినిమాకి మెయిన్ ఎసెట్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్ . చూడాలి మరి బిజినెస్ సర్కిల్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న ఫౌజీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో!