E-Paper
Advertisement

ల్యాండ్‌స్కేప్ కెమెరాతో శాంసంగ్ కొత్త టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

ల్యాండ్‌స్కేప్ కెమెరాతో శాంసంగ్ కొత్త టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Galaxy Tab S12+: శాంసంగ్ కంపెనీ తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ సిరీస్‌గా ‘గెలాక్సీ Tab S12 Plus’ను మార్కెట్లోకి తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. గత ఏడాది విడుదలైన గెలాక్సీ Tab S11 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త లైనప్ రానుంది. ఇందులో గెలాక్సీ Tab S12, Tab S12+, Tab S12 అల్ట్రా అనే మూడు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ గురించి శాంసంగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. తాజాగా గెలాక్సీ Tab S12+ మోడల్ దక్షిణ కొరియాకు చెందిన సేఫ్టీ కొరియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడం టెక్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో లైవ్ ఇమేజ్:

తాజా లీక్స్ ప్రకారం.. గెలాక్సీ Tab S12+ టాబ్లెట్ SM-X840, SM-X846N అనే మోడల్ నెంబర్లతో సేఫ్టీ కొరియా డేటాబేస్‌లో లిస్ట్ అయింది. దీనిలో N అక్షరంతో ముగిసే మోడల్ నెంబర్ దక్షిణ కొరియా వేరియంట్‌కు సంబంధించినదని తెలుస్తోంది. ఈ లిస్టింగ్‌లో టాబ్లెట్‌కు సంబంధించిన ఒక లైవ్ ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. ఇది రాబోయే కొత్త టాబ్లెట్ డిజైన్ ఎలా ఉండబోతుందో ముందే చూపిస్తోంది.

Advertisement

Also Read: గూగుల్ షాకింగ్ రూల్.. ఒకే అకౌంట్‌తో ఎక్కువ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

ల్యాండ్‌స్కేప్ కెమెరా, డిజైన్:

ఈ కొత్త టాబ్లెట్ డిస్‌ప్లే చుట్టూ చాలా సన్నని, సమానమైన బెజెల్స్ ఉన్నాయి. గత ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ల తరహాలోనే శాంసంగ్ దీని డిజైన్‌ను కూడా కొనసాగించినట్లు కనిపిస్తోంది. అయితే, ఇందులో సెల్ఫీ కెమెరాను ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఉపయోగించేలా స్క్రీన్ పైభాగం మధ్యలో అమర్చారు. దీనివల్ల వీడియో కాల్స్ మాట్లాడుకునేటప్పుడు యూజర్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

గ్లోబల్ లాంచ్‌కు లైన్ క్లియర్:

Advertisement

గెలాక్సీ Tab S12+ సర్టిఫికేషన్లు పొందడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలోనే ఇది SM-X846B మోడల్ నెంబర్‌తో ఐఎంఈఐ డేటాబేస్‌లో కనిపించింది. ఆ తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లోనూ దర్శనమిచ్చింది. ఈ మోడల్ నెంబర్లను బట్టి చూస్తే శాంసంగ్ దీనిని వై-ఫై, 5G వేరియంట్లలో తీసుకువస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వరుస లిస్టింగ్‌లు చూస్తుంటే ఈ టాబ్లెట్ త్వరలోనే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అర్థమవుతోంది.

పాత మోడళ్లతో పోలిక:

రాబోయే లైనప్‌లో గెలాక్సీ Tab S12+ మోడల్.. బేసిక్ వేరియంట్‌కు, హై-ఎండ్ అల్ట్రా వేరియంట్‌కు మధ్యస్థంగా ఉండబోతోంది. గత ఏడాది వచ్చిన Tab S11 సిరీస్‌లో ప్లస్ మోడల్ లేదు. కేవలం గెలాక్సీ Tab S11, Tab S11 అల్ట్రా మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌, శక్తివంతమైన బ్యాటరీలతో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు రాబోయే Tab S12 సిరీస్ వాటికంటే మెరుగైన ఫీచర్లతో అలరించనుంది.

Also Read: బ్యాక్ కెమెరా చూస్తూ సెల్ఫీలు తీసుకునేలా ఒప్పో సరికొత్త యాక్సెసరీ.. Reno 16 ఫోన్ల ధర, ఫీచర్లు ఇవే!

Related News

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Big Stories

Advertisement
×