E-Paper
Advertisement

పళ్లతో బాటిల్ క్యాప్స్ తీస్తున్నారా? ఎంత పెద్ద ప్రమాదమో తెలుసుకోండి!

పళ్లతో బాటిల్ క్యాప్స్ తీస్తున్నారా? ఎంత పెద్ద ప్రమాదమో తెలుసుకోండి!
Advertisement

Teeth Care Tips: ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు లేదా బయట కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు ఓపెనర్ దొరకకపోతే చాలా మంది వెంటనే చేసే పని.. బాటిల్ మూతను పళ్లతో కొరికి తెరవడం. కొంతమంది అదొక పెద్ద అచీవ్‌మెంట్‌లా, స్టైల్‌లా ఫీలవుతారు. కానీ.. డెంటిస్ట్‌లు చెబుతున్న దాని ప్రకారం ఇది మీ పళ్లకు మీరే చేసుకునే అతిపెద్ద చేటు. మన పళ్లు ఉన్నవి ఆహారాన్ని నమలడానికి మాత్రమే, సీసాలు తెరవడానికి కాదు. మరి ఈ అలవాటు వల్ల దంతాలకు జరిగే ఆ తీవ్రమైన నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలోనే అత్యంత బలమైన భాగం దంతాల పైపొర అయిన ‘ఎనామిల్’. కానీ..అది ఎంత బలంగా ఉన్నా సరే.. ఐరన్ లేదా గట్టి ప్లాస్టిక్‌తో చేసే బాటిల్ క్యాప్స్‌ను తట్టుకునేంత సీన్ దానికి లేదు. బాటిల్ మూతను పళ్లతో గట్టిగా నొక్కినప్పుడు ఆ ఒత్తిడికి పళ్లపై విపరీతమైన లోడ్ పడుతుంది.

పళ్లతో సీసాలు తెరిస్తే జరిగే నష్టాలు:

Advertisement

1. పళ్లు చిట్లిపోవడం లేదా విరగడం :
చాలా సార్లు బాటిల్ మూత తీసే క్రమంలో పళ్ల అంచులు చిట్లిపోతాయి . కొన్నిసార్లు పంటి లోపలి వరకు పగుళ్లు వస్తాయి. ఇది పైకి కనిపించకపోయినా.. లోపల పంటి వేర్ల వరకు డ్యామేజ్ జరిగి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది.

2. ఎనామిల్ లేయర్ దెబ్బతినడం :
మెటల్ క్యాప్స్ పంటికి తగలడం వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర అయిన ఎనామిల్ అరిగిపోతుంది. ఎనామిల్ ఒకసారి పోతే మళ్లీ రాదు. దీని వల్ల పళ్లు బలహీనపడి, గాలి తగిలినా లేదా చల్లటి, వేడి పదార్థాలు తిన్నా పళ్లు విపరీతంగా లాగడం మొదలవుతుంది.

Advertisement

3.చిగుళ్ల గాయాలు :
బాటిల్ క్యాప్స్ పళ్లతో తీసేటప్పుడు ఒక్కోసారి చేయి జారితే.. ఆ పదునైన మూతలు చిగుళ్లకు గుచ్చుకుంటాయి. దీని వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది.

4. రూట్ కెనాల్ :
పంటి లోపల ఉండే పల్ప్ (నరాలు) దెబ్బతింటే విపరీతమైన నొప్పి వస్తుంది. అప్పుడు డెంటిస్ట్ చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే పంటిని పూర్తిగా పీకేసి కృత్రిమ పన్ను పెట్టాల్సి వస్తుంది.

సలహాలు:
మీ పళ్లు లైఫ్ లాంగ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిన్న విషయాలు గుర్తుంచుకోండి.

మీ కీ-చైన్‌కు ఎప్పుడూ ఒక చిన్న పాకెట్ ఓపెనర్ ఉండేలా చూసుకోండి.

స్మార్ట్‌ఫోన్ కవర్స్ వెనక లేదా వాలెట్‌లో పట్టేలాంటి క్రెడిట్ కార్డ్ సైజ్ ఓపెనర్లు వాడుకలోకి వచ్చాయి. వాటిని వాడండి.

పళ్లను కేవలం నమలడానికి మాత్రమే వాడండి.. టేప్ కట్ చేయడానికి, ప్యాకెట్లు చించడానికి, సీసాలు తెరవడానికి కాదు!

Related News

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

Big Stories

Advertisement
×