E-Paper
Advertisement

అద్భుత ఆవిష్కరణ.. ఇకపై కిటికీలే ఏసీలు.. సరికొత్త కూలింగ్ అద్దాలు!

అద్భుత ఆవిష్కరణ.. ఇకపై కిటికీలే ఏసీలు.. సరికొత్త కూలింగ్ అద్దాలు!
Advertisement

Smart Cooling Glass: సాధారణంగా ఇళ్లు, కార్యాలయాలను కూల్ చేసేందుకు ఏసీలు, కూలర్లను వినియోగిస్తుంటారు. అయితే కిటికీల అద్దాల ద్వారానే గదుల్లోని ఉష్ణోగ్రతను తగ్గించే సరికొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ కొత్త గ్లాస్ టెక్నాలజీ సూర్యుడి నుంచి వచ్చే వేడిని తిప్పికొట్టడమే కాకుండా గదిలోని అదనపు వేడి బయటకు వెళ్ళిపోయేలా డిజైన్ డిజైన్ చేస్తున్నారు.

‘అడ్వాన్స్‌డ్ ఫంక్షనల్ మెటీరియల్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎండ, దుమ్ము, వర్షం వంటి కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఒక ప్రత్యేక ప్యాసివ్ రేడియేటివ్ కూలింగ్ కోటింగ్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కోటింగ్ తో తయారైన అద్దాలు పగటిపూట వచ్చే వేడిని ప్రతిబింబిస్తూ లోపలి వేడిని ఇన్‌ఫ్రారెడ్ కిరణాల రూపంలో సమర్థవంతంగా బయటకు పంపనున్నాయి.

Advertisement

గతంలో రూపొందించిన కొన్ని కూలింగ్ మెటీరియల్స్.. రాత్రివేళల్లో మరింత చల్లగా మారుతూ అసౌకర్యానికి గురిచేసేవి.. అయితే ఈ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఇందులో ఒక ‘ఫేజ్ చేంజ్ మెటీరియల్’ను చేర్చారు. ఇది పగటిపూట వేడిని నిల్వ చేసుకుని, రాత్రి వేళల్లో క్రమంగా విడుదల చేయడం ద్వారా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. పరీక్షల్లో భాగంగా ఈ కోటింగ్ పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.8°C తక్కువ కూలింగ్‌ను అందించింది. అలాగే ఒక నెల రోజుల పరీక్షల తర్వాత కూడా దీని సామర్థ్యం ఏమాత్రం తగ్గకుండా అత్యంత మన్నికైనదిగా నిరూపితమైంది.

ఇంతకుముందు ఇలాంటి కోటింగ్స్ తెల్లగా, అపారదర్శకంగా ఉండటం వల్ల కిటికీలకు వాడటం కుదరలేదు. కానీ ‘నానో లెటర్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. శాస్త్రవేత్తలు సరికొత్త పారదర్శక థర్మల్ ఎమిటర్‌ను తయారు చేశారు. ఇది సహజ సిద్ధమైన వెలుతురును లోపలికి రానిస్తూనే సాధారణ గ్లాస్‌తో పోలిస్తే కిటికీ గ్లాస్ ఉష్ణోగ్రతను 4.8°C వరకు తగ్గిస్తుంది. తద్వారా వేడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఏసీల అవసరం చాలా వరకు తగ్గుతుంది.

Advertisement

Also Read: పాతవన్నీ పక్కన పెట్టేయండి.. అరాచకమైన ఫీచర్లతో ‘Mi Band 11’ వచ్చేస్తోంది!

ప్రస్తుతం ఈ సాంకేతికత పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ ప్యాసివ్ కూలింగ్ రంగంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లను ఇది పరిష్కరించినట్లైంది. కమర్షియల్ బిల్డింగుల్లోకి ఈ టెక్నాలజీ రావడానికి మరికొంత సమయం పట్టినప్పటికీ.. భవిష్యత్తులో కిటికీలు కేవలం వెలుతురు కోసమే కాకుండా విద్యుత్ లేకుండా ఇళ్లను చల్లబరిచే స్మార్ట్ విండోస్‌గా మారనున్నట్లు ఈ పరిశోధన బట్టి అర్థమవుతోంది.

Also Read: గూగుల్ షాకింగ్ రూల్.. ఒకే అకౌంట్‌తో ఎక్కువ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

Related News

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

Big Stories

Advertisement
×