పెళ్లనేది నూరేళ్ల పంట అంటారు పెద్దలు. ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకున్నా అది పెంట అవుతుంది. అందుకే, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే.. కలకాలం సుఖ సంతోషాలతో ఉంటారు. ఏదైనా ఇబ్బంది కలిగినా పెద్దలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. అయితే, అసలు పెళ్లే ఇష్టం లేకపోతే, ఆ సంసారం ఎంతోకాలం ముందుకుసాగదు. ఇంకా చెప్పాలంటే, ఆ పెళ్లి మధ్యలోనే పెటాకులు అవుతుంది. తాజాగా ఓ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటూ.. వరుడికి చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంధువుల ముందే వరుడిపై రుసరుసలు
ఇక ఈ వీడియోలో బంధువులు అందరి ముందే అమ్మాయి వ్యవహరించిన తీరు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అబ్బాయి ముందుగానే స్టేజి మీదికి వస్తాడు. అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ స్టేజి వైపు వస్తుంది. అమ్మాయికి సాయంగా చేయి అందించేందుకు అబ్బాయి ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయి అతడి చేతి మీద కొట్టడంతో పాటు రెండు చేతులో అతడిని పక్కకు తోసేస్తుంది. ఆ తర్వాత స్టేజి మీద నిలబడుతుంది. ఆమె పక్కన ఇద్దరు అమ్మాయిలు నిలబడతారు. పెళ్లి కూతురు ప్లేట్ లో స్వీట్ తో నిలబడుతుంది. ఆ స్వీట్ తీసి అమ్మాయికి తినిపించే ప్రయత్నం చేస్తాడు అబ్బాయి. అతడు పెట్టక ముందే ఆ అమ్మాయి తీసుకుని నోట్లో వేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అబ్బాయి నెమ్మదిగా ఆ అమ్మాయి మెడలో పూల మాల వేస్తాడు. ఇక అమ్మాయి కోపంతో ఆ అబ్బాయి మీదికి విసురుతుంది. అది అతడి మెడ మీద ఆగకుండా, కింద పడిపోతుంది. మళ్లీ తను ఆ దండను తీసుకుని మెడలో వేసుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Marriage is scary these days, what if she pic.twitter.com/4iV1baxdQ8
— ︎ ︎venom (@venom1s) January 23, 2025
Read Also:దొంగకు దూల తీరింది.. కిటికీలో చెయ్యి పెట్టాడు, ఇంతలో రైలు కదిలింది, ఆ తర్వాత…!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమ్మానాన్నలు బలవంతంగా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. వేరే ఎవరినో ఇష్టపడుతుంది. అందుకే ఆమె అలా ప్రవర్తిస్తుంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “నాకు తెలిసి ఇదో ఫేక్ వీడియో. ఇది కేవలం వ్యూస్ కోసం షూట్ చేసి వీడియో” అని మరో వ్యక్తి స్పందించాడు. “ఈ వీడియో చూసిన తర్వాత, పెళ్లి చేసుకోవడం కంటే, చేపలు అమ్ముకోవడం మంచిది అనిపిస్తోంది” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఇది జస్ట్ రీల్ కోసం చేశారు. రియల్ కాదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “త్వరలో మరో భరణం కేసు కోర్టుకు చేరనుంది” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. చాలా మంది ఈ వీడియో వ్యూస్ కోసం చేసిందనే అభిప్రాయపడుతున్నారు. నిజమో, అబద్దమో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది.
Read Also: రైల్లో టీ తాగుతున్నారా? ఈ వీడియో చూస్తే జీవితంలో చాయ్ జోలికి వెళ్లరు!