BigTV English

Viral Video: భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలు.. అయినా పెళ్లికి హాజరైన అతిథులు..

Viral Video: భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలు.. అయినా పెళ్లికి హాజరైన అతిథులు..

Viral Video: వర్షాకాలంలో మొదలైంది. ఇక రకరకాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి రోడ్లన్నీ నీటితో నిండిపోతుంటే ఆ వరదల్లో వింత ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వర్షాకాలంలో వరదలు రావడం, ఆ వరదల్లో జనాలు కొట్టుకుపోవడం లేదా వరదల్లో విన్యాసాలు చేయడం వంటి వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. అయితే వర్షాకాలంలోను మంచి రోజులు ఉంటాయి. ఈ తరుణంలో చాలా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. అయితే తాజాగా వర్షంలోను ఓ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెళ్లికి బారిగా బంధువులు, అతిథులు తరలివచ్చారు. ఓ పెళ్లి జంట వర్షాకాలంలోనే పెళ్లి పెట్టుకోవడంతో భారీ వర్షం పడింది. దీంతో పెళ్లి మండపం మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. దాదాపు మోకాళ్ల లోతు నీటిలో అందరూ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇంత వరదలోను వధువరులు తమ పెళ్లిని అట్టహాసంగా జరుపుకున్నారు అంటే ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోను భారీ వరదల్లోను బంధువులు పెళ్లికి హాజరుకావడం షాక్‌కు గురిచేస్తుంది. బంధువులు తమ పిల్లలతో కలిసి పెళ్లికి హాజరయ్యారు.

తమ పిల్లలను చేతిలో ఎత్తుకుని ఆ వరదలో పెళ్లికి హాజరవుతున్నారు. ఇలా వర్షంలో తడుస్తూ కూడా బంధువులు పెళ్లికి హాజరవ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి చూసుకుని అదే వరదల్లో భోజనాలు చేసి మరి తిరిగి వెళ్లారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలాంటి పెళ్లిళ్లకు హాజరవ్వడం అంటే అది కేవలం భోజనాల కోసమే అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు.


 

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×