BigTV English

Mahesh Babu: ఇచ్చిన మాట తప్పిన మహేష్.. జక్కన్న ఏం చేస్తాడో.. ?

Mahesh Babu: ఇచ్చిన మాట తప్పిన మహేష్.. జక్కన్న ఏం చేస్తాడో.. ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపు అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జక్కన్న కథను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యిందని టాక్.


ఇక ఇంకోపక్క క్యాస్టింగ్ పనులను కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈలోపు మహేష్ ను లుక్ పరంగా ప్రిపేర్ అవ్వమని రాజమౌళి చెప్పాడట. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో మహేష్ లుక్ ఉండాలని చెప్పడంతో.. సినిమాకు తగ్గట్టు మహేష్ మారుతున్నాడు. అయితే ముందే మహేష్ నుంచి జక్కన్న ఒక మాట తీసుకున్నాడట.

సినిమా స్టార్ట్ అయ్యేవరకు లుక్ రివీల్ చేయకూడదని చెప్పాడట. అందుకే మహేష్ ఇప్పటివరకు బయట ఎక్కడ కనిపించినా క్యాప్, గాగుల్స్ తో మేనేజ్ చేస్తూ వచ్చాడు. కానీ, అనంత్ అంబానీ పెళ్లి వలన మహేష్ లుక్ రివీల్ అయ్యింది. పెళ్ళికి మహేష్ కుటుంబంతో సహా హాజరయ్యాడు. బ్లూ కలర్ షేర్వాణ.. లాంగ్ హెయిర్, గడ్డంతో హాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇదే SSMB29 అని తెలుస్తోంది.


ఇక ఈ లుక్ బయటపడడంతో మహేష్.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పినట్టే అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. తాను లుక్ రివీల్ చేయొద్దు అని చెప్పినా కూడా మహేష్ రివీల్ చేయడంతో ఆయన పై జక్కన్న గుర్రుగా ఉన్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్తుందని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×