E-Paper
Advertisement

Viral Video: చికెన్ రుచిగా లేదని కోడలును కిటికీలోంచి తోసిన భర్త, అత్త

Viral Video: చికెన్ రుచిగా లేదని కోడలును కిటికీలోంచి తోసిన భర్త, అత్త
Advertisement

Viral Video: చాలా మంది చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటారు. కొన్ని సార్లు కోపంలో ఎవరూ ఊహించలేని పనులు కూడా చేస్తుంటారు. ఈ తరుణంలో ఎదుటి వారిని కొట్టడం, లేదా హత్య చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో కోడళ్లపై అయితే చిత్రహింసలు పెడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంట్లో కోడలిపై అరాచకాన్ని ప్రదర్శించారు. ఏకంగా కిటికీలోంచి కోడలిని బయటికి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన పాకిస్థాన్ లో వెలుగుచూసింది.

కిటికీ నుండి తోసేశారు..

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీధిలో అంతా నిశ్శబ్దం ఉన్న సమయంలో ఒక్కసారిగా బంగ్లాపై నుంచి అకస్మాత్తుగా యువతి నేరుగా కిందకు పడిపోయింది. ఆమె నేలపై పడగానే పెద్ద శబ్ధం, అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారందరూ బయటకు వచ్చి యువతికి సహాయం చేశారు. మహిళను అత్త మరియు భర్త, మరిది కిటికీలోంచి కిందకు తోసేశారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. చికెన్ సరిగ్గా వండలేదనే కోపంతో తనను కిటికీలోంచి తోసేశారని తెలిపింది.

ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని నాన్‌రియల్ చౌక్‌లోని షాలిమార్ రోడ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఈ రోజుల్లోను ఇలాంటి ఘటనలు చూడడం నిజంగా దురదృష్టకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×