EPAPER

New Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 100 కిలోమీటర్ల రేంజ్.. రూ.లక్షతో దక్కించుకోండి!

New Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 100 కిలోమీటర్ల రేంజ్.. రూ.లక్షతో దక్కించుకోండి!

New Electric Scooter: ఇటాలియన్ టూవీలర్ కంపెనీ వెలోసిఫెరో (VLF), KAW వెలోస్ మోటార్స్ త్వరలో భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇది టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో లాంచ్ అవుతుంది. ఈ పండుగ సీజన్‌లో అక్టోబర్-నవంబర్ మధ్య విడుదల చేయవచ్చు. VLF టెన్నిస్ 2 వేరియంట్‌లలో వస్తుంది. అందులో 1.5kW, 4kW ఉన్నాయి. ఇవి వరుసగా 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల రేంజ్‌ని అందించగలవు. ఇది Ather 450S, Ather 450X, Ola Electric S1తో నేరుగా పోటీపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.


VLF టెన్నిస్ డిజైన్ Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది. ఇందులో LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది కాకుండా స్కూటర్‌లో 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 3 రైడింగ్ మోడ్‌లు. ఎకో, కంఫర్ట్, స్పోర్ట్  ఉంటుంది. సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ యూనిట్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక భాగంలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే ముందు, వెనుక 12-అంగుళాల ట్యూబ్‌లెస్ వీల్స్ చూడొచ్చు.

Also Read: టాటా మోటర్స్ కనివినీ ఎరుగని ఆఫర్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే?


టెన్నిస్ స్కూటర్‌ను రిమూవబుల్ లిథియం బ్యాటరీతో విడుదల చేయనున్నారు. దీని 1.5kW వేరియంట్ గరిష్ట వేగం 45 km/h. ఇది ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. మరోవైపు 4kW వేరియంట్ గరిష్టంగా 100 km/h వేగంతో 5-6 గంటల్లో ఛార్జ్ అవుతుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

KAW వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ సాల్కే మాట్లాడుతూ.. బడ్జెట్ ధరలలో బ్రాండింగ్,  ప్రీమియం రైడింగ్ అనుభవంపై దృష్టి సారించడం ద్వారా భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపాలని VLF లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. VLF తో మేము భారతీయ వినియోగదారులకు డిజైన్, పనితీరులో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తామన్నారు. KAW వెలోస్ మోటార్స్ VLF కోసం తయారీ, సేల్స్ రెండింటినీ నిర్వహిస్తుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.

Also Read: టాటా కర్వ్ ఈవీ.. ప్రత్యేకతలు ఇవే.. త్వరలో లాంచ్!

VLF, KAW వెలోస్ మోటార్స్ ఈ ప్రయత్నంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న కొత్త ఉత్పత్తి కర్మాగారం కీలక పాత్ర పోషిస్తుంది. కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని, బలమైన డీలర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కీలక భాగస్వామిగా మారాలని VLF చూస్తోంది. పండుగ సీజన్‌లో టెన్నిస్ ఈ-స్కూటర్‌ను ప్రారంభించడం భారతదేశంలో VLF లాంచ్ అవడానికి ఒక మైలురాయిగా నిలబడుతుంది.

Tags

Related News

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Zomato Hikes : ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. దీపావళికి కానుకగా కస్టమర్లకు భారీ షాక్!

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Maharaja’s Express Train: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Today Gold Prices: పండగ వేళ భారీ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Big Stories

×