BigTV English

Bharateeyudu 2: సినిమా ఎండ్ అయ్యిందని వెళ్లిపోకండి.. ట్విస్ట్ అక్కడే ఉందంట

Bharateeyudu 2: సినిమా ఎండ్ అయ్యిందని వెళ్లిపోకండి.. ట్విస్ట్ అక్కడే ఉందంట

Bharateeyudu 2: ఇన్నాళ్లకు భారతీయుడు 2 కు మోక్షం దక్కింది. ఈ సినిమా ఎన్ని వివాదాలు మధ్య ఫినిష్ అయ్యిందో అందరికి తెల్సిందే. కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా మొదలయ్యింది. ఎంతో గ్రాండ్ గా లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించింది.


ఇక ఆ తరువాత కొన్ని రోజులకే లైకాకు శంకర్ కు మధ్య జరిగిన విబేధాల వలన సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తరువాత సెట్ లో అగ్నిప్రమాదం వలన కొన్ని నెలలు ఆగింది. ఇలా ఆగుతూ వస్తూ ఇన్నాళ్లకు ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన భారతీయుడు 2 చిత్రంపై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలానే పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ సైతం మంచి హైప్ ఇవ్వడంతో ఈసారి శంకర్ మంచి హిట్ ఇచ్చేలా ఉన్నాడని సోషల్ మీడియాలో టాక్ కూడా నడుస్తోంది.


ఇక ఈ నేపథ్యంలోనే రేపు సినిమాకు వెళ్లే ప్రేక్షకులకు ఒక సూచన చేస్తున్నారు నెటిజన్స్. ది ఎండ్ పడ్డాక హమ్మయ్య సినిమా అయిపోయిందని వెళ్లిపోకండి. ఎందుకంటే.. అప్పుడే అసలు ట్విస్ట్ ఉండనుందంట. అదేంటంటే.. ఎండ్ కార్డ్స్ లోనే భారతీయుడు ట్రైలర్ ను కూడా యాడ్ చేశారట.

సాధారణంగా ప్రతి సినిమా ఎండ్ కార్డ్స్ లో దానికి సీక్వెల్ ఉందని ప్రకటిస్తూ టైటిల్ ను రివీల్ చేస్తారు. కానీ, శంకర్ మాత్రం ఏకంగా సీక్వెల్ ట్రైలర్ ను కూడా చూపించబోతున్నాడట. ఇప్పటికే పార్ట్ 3 షూటింగ్ కూడా సగం పూర్తి అయ్యిందంట. అందుకే.. సినిమా అయిపోయిందని టక్కున వెళ్లకుండా ట్రైలర్ ను కూడా చూసి రమ్మని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి ఈ సినిమాతో కమల్ – శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×