E-Paper
Advertisement

Groom Angry Video: ఆటపట్టించటానికి కూడా ఓ హద్దు ఉంటుంది బ్రో.. వరుడికి కోపం రావడంలో తప్పే లేదు..!

Groom Angry Video: ఆటపట్టించటానికి కూడా ఓ హద్దు ఉంటుంది బ్రో.. వరుడికి కోపం రావడంలో తప్పే లేదు..!
Advertisement

Groom Angry Viral Video: పెళ్లికి సంబంధించిన చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్‌లోడ్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తరచూ వేల కొద్ది వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఉంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో వేదికపైనే వరుడికి, బావమరిది మధ్య గొడవ జరిగింది. జయమాల వేడుక ముగిసిన వెంటనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే, అతిథులు కూడా అవాక్కయ్యేంత దారుణంగా మారింది. ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు బంధువులు వేదికపైకి వచ్చి ఆపినా కూడా గొడవ సర్దుమనగలేదు. అసలు ఏం జరిగింది. ఆ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుడికి కోపం రావడంలో తప్పు లేదు..

Advertisement

వైరల్ అవుతున్న ఈ వీడియోలో జయమాల వేడుక ముగిసిన తర్వాత వధూవరులు వేదికపై కూర్చున్నారు. అనంతరం అందరూ ఇద్దరితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో పెళ్లికూతురు బావ వచ్చి వరుడి కుర్చీ వెనకాల నిలబడ్డాడు. కొద్దిసేపటికే అతను వరుడిని ఆటపట్టించడం ప్రారంభించాడు. వరుడి తలపాగా తీస్తూ పెడుతూ ఆటపట్టిస్తుంటాడు. వరుడికి కోపం వస్తున్నా, చాలా వరకు ఆపుకునేందుకు ప్రయత్నించాడు. కానీ వెనుక నిలబడి ఉన్న వ్యక్తికి ఇది అర్థం కాలేదు. వరుడిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. చివరికి ఒక్కసారిగా పెళ్లి కొడుకుకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో వెంటనే ఆ వ్యక్తిపై దాడి చేశాడు. ఇలా వేదికపైనే వీరిద్దరి మధ్య చాలా గొడవ మొదలైంది.

వేదికపై గందరగోళం..

Advertisement

వధువు బావపై వరుడు దాడి చేశాడు. చాలా మంది వేదికపైకి పరుగులు తీసి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వారంతా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరి మధ్య గొడవ చాలా సేపు కొనసాగింది. వధువు, పెళ్లికి విచ్చేసిన బంధువులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Viral Video: కాబోయే భర్త అని కూడా చూల్లేదు.. పాపం పెళ్లి కొడుకును ఓ రేంజ్‌లో చితకొట్టేసింది

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×