BigTV English

Lavanya Tripathi Injured: మెగా కోడలు కాలికి గాయం.. షాక్‌లో ఫ్యాన్స్!

Lavanya Tripathi Injured: మెగా కోడలు కాలికి గాయం.. షాక్‌లో ఫ్యాన్స్!

Actress Lavanya Tripathi Injured: నటి లావణ్య త్రిపాఠి.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో స్టార్ హీరోయిన్ ఫేం సంపాదించుకుంది. ఆ సమయంలోనే టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక సినిమాలు చేస్తున్న క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది.


దీంతో కొన్నేళ్లు ప్రేమాయణం చేసిన ఈ జంట ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం లావణ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ కేవలం ఇంటికే పరిమితం అయింది. ఇంట్లో తమ అత్తమ్మ కుటుంబాన్ని చూసుకుంటుంది. అంతేకాకుండా ది మోస్ట్ టాలీవుడ్ లవ్ కపుల్స్‌ లిస్ట్‌లో ఈ జంట చేరిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఆమె కాలుకి పెద్ద గాయమైనట్లు తెలుస్తోంది. ఇవాళ (జూన్ 12) పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో నిన్నినే మెగా కుటుంబం అంతా కలిసి గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం మిస్ అయింది. ఏమైందా అని చూస్తే.. ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.


Also Read: లావణ్య త్రిపాఠి చేసిన పనికి అత్తమ్మాస్ కిచెన్‌పై విమర్శలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

అందుకు సంబంధించిన విషయాన్ని తానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన కుడికాలికి గాయమైందని.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని.. కోలుకుంటున్నానని తెలిపింది. అయితే ఆమె కాలుకి గాయం ఎలా అయిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ విషయం తెలిసి అటు లావణ్య త్రిపాఠి అభిమానులు, ఇటు మెగా అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. ఏమైంది ఏమైంది అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ గాయం షూటింగ్ చేస్తున్న సమయంలో తగిలిందా? లేక ఇంట్లోనే ఏదైనా గాయం జరిగిందా అని నెటిజన్లు గుస గుసలాడుకుంటున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×