E-Paper
Advertisement

Ice Cream for Headache: తలనొప్పిని తగ్గించే ఐస్‌క్రీమ్.. ఇందులో ఆ పాపులర్ ట్యాబ్లెట్ కలుపుతున్నారట!

Ice Cream for Headache: తలనొప్పిని తగ్గించే ఐస్‌క్రీమ్.. ఇందులో ఆ పాపులర్ ట్యాబ్లెట్ కలుపుతున్నారట!
Advertisement

తలనొప్పిని మాయం చేసే ఐస్ క్రీం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నెదర్లాండ్స్‌ లో ఒక బేకరీ పారాసెటమాల్‌ తో ప్రత్యేక ఐస్ క్రీం తయారు చేసింది. ఇందులో పనాడోల్ లాంటి నొప్పి నివారణ మందులను కూడా కలిపింది. అయితే, దీనిని తినడానికి తయారు చేయలేదు. ఒక పెద్ద పార్టీలో కేవలం ఫన్నీ ప్రదర్శన కోసం పెట్టింది. ఇంతకీ ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే..

కార్నివాల్ ఫెస్టివల్ కోసం తయారీ..   

2016లో నెదర్లాండ్స్‌ లోని ఔడెన్‌ బోష్ అనే చిన్న పట్టణంలో మాడీస్ అనే బేకరీ ఉండేది. దాని యజమాని జాన్ నాగెల్కెర్కే. యాన్యువల్ కార్నివాల్ ఫెస్టివల్ కోసం సరదగా ఏదైనా ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకున్నాడు. కార్నివాల్ వేడుకలో ఆ పట్టణంలో పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిని ప్రదర్శించాలనుకున్నాడు. ఈ పార్టీలో పాల్గొనే వారు మెరిసిపోయే దుస్తులు ధరించి నృత్యం చేస్తారు. కొన్నిసార్లు ఎక్కువగా మద్యం తాగుతారు. మరుసటి రోజు, చాలా మందికి తలనొప్పి, హ్యాంగోవర్ వస్తుంది. ఈ నేపథ్యంలో జాన్ ప్రతి స్కూప్‌ లో 500 mg పారాసెటమాల్‌ తో ఐస్ క్రీం తయారు చేశాడు. అదే సమయంలో ఓ పెయిన్ కిల్లర్ ను కూడా కలిపాడు. ఐస్ క్రీం కోన్ పైన నిజమైన టాబ్లెట్ బాక్స్‌ ను ఉంచాడు.

అమ్మకానికి కాదు, జస్ట్ ప్రదర్శన కోసమే!    

Advertisement

ఈ ఐస్ క్రీమ్ జాన్ ఎప్పుడూ అమ్మలేదు. ఎవరూ తినలేదు కూడా. ప్రజలను నవ్వించడానికి మాత్రమే దీనిని తయారు చేశాడు. అంతేకాదు, తక్కువ తాగడం వల్ల తలనొప్పి, హ్యాంగోవర్ సమస్య రాదని పార్టీకి వచ్చే వారికి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.  జాన్ ఫిబ్రవరి 4, 2016న బేకరీ ఫేస్‌ బుక్ పేజీలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.”ఇది ప్రపంచంలోనే తొలి  పారాసెటమాల్ ఐస్ క్రీం. ఇది చాలా రుచికరంగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇది కార్నివాల్ సమయంలో హ్యాంగోవర్లకు సహాయపడుతుంది” అని రాసుకొచ్చాడు.

Read Also:  రన్నింగ్ ఆటో మీద దూకి, అమ్మాయిని కాపాడిన హిందూ హీరో!

నెట్టింట వైరల్ అయిన ఫోటో

Advertisement

పిల్ బాక్స్‌ తో ఉన్న ఐస్ క్రీం కోన్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చాలామంది దీనిని మీరు కొనుగోలు చేయగలిగే ఐస్ క్రీమ్ అనుకుంటారు. కానీ, సరదా కోసం తయారు చేసిన ఒక బ్యాచ్ మాత్రమే. ఈ ఐస్ క్రీమ్ తర్వాత జాన్ సృజనాత్మక బేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి కస్టమర్లను ఆశ్చర్యపరిచేందుకు ఫన్నీ బేకరీ ఐటెమ్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు.

Read Also: శునకానికి ఘనంగా శ్రీమంతం.. నెట్టింట వీడియో వైరల్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×