E-Paper
Advertisement

Viral Video: మీరు గ్రేట్ సార్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్..

Viral Video: మీరు గ్రేట్ సార్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్..
Advertisement

Viral Video: ఇటీవల హఠాత్మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు మనతో బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వంటి సన్నివేశాలు తరచూ ఏదో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు కేవలం పెద్దవారిలో మాత్రమే కాకుండా.. చిన్న పిల్లలో కూడా చూస్తూనే ఉన్నాం. తరచూ ఏదో ఒక సమస్యతో ప్రాణాలు కోల్పోవడం, ఉన్నట్టుండి పడిపోవడం వంటి సన్నివేశాలు కూడా చూశాం. అయితే తాజాగా ఓ చిన్నారి ఉన్నట్టుండి ఊపిరాడని స్థితిలో కనిపించింది. ఒక్కసారిగా ఊపిరి అందకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

చిన్నారిని ఊపిరాడని స్థితిలో చూసిన ఓ పోలీస్ ఆఫీసర్ దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ లో వెలుగుచూసింది. చిన్నారి పాలు తాగుతూ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో వెంటనే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుందని తల్లి సహా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడ రోడ్డుపై కనిపించిన పోలీసుల చేతికి చిన్నారి ఇచ్చి కాపాడాలని వేడుకున్నారు.

Advertisement

చిన్నారి పరిస్థితి చూసిన ఓ పోలీస్ ఆఫీసర్ వెంటనే ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బంది పడి అపస్మారస్థితిలోకి చిన్నారి వెళ్లినట్లు గమనించాడు. దీంతో వెంటనే చిన్నారి వీపుపై రుద్దుతూ, ఊపిరి పీల్చుకునేలా క్షణాల్లో ప్రథమ చికిత్స చేశారు. దీంతో పోలీసు ఆఫీసర్ చేసిన పనికి తల్లి సహా కుటుంబ సభ్యులు దేవుడిలా వచ్చి కాపాడారంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిజమైన హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×