BigTV English

Viral Video: రైలు పట్టాలపై ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలోనే ట్రైన్ రావడంతో..

Viral Video: రైలు పట్టాలపై ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలోనే ట్రైన్ రావడంతో..

Train hitting rickshaw: రైలు పట్టాలు దాటే సమయంలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతుంటారు. అయినా కూడా ఏ మాత్రం మారకుండా అలానే ప్రవర్తిస్తుంటారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే ఓ చోట జరిగింది. రైలు పట్టాలు దాటే సమయంలో నిర్లక్ష్యం వహించడంతో పట్టాల మధ్య రిక్షా ఇరుక్కుపోయింది. క్షణాల్లోనే రైలు వచ్చింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఈ ఘటనలో రిక్షా నుజ్జునుజ్జయ్యింది. కానీ, ఎవరికీ ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. ప్రమాదం జరగడంతో జనమంతా కూడా అక్కడ గుమిగూడారు. పలువురు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం బంగ్లాదేశ్ లో జరిగినట్లు తెలుస్తోంది.


బంగ్లాదేశ్ లోని ఓ నగరంలో రైలు పట్టాల మీద నుంచి వాహనాలు అటూ, ఇటూ దాటుతున్నాయి. రైలు వచ్చే సమయం కావడంతో కొంతమంది వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుకుని, ట్రైన్ వెళ్లాక వెళ్దామంటూ వేచి ఉన్నారు. ఇంతలోనే ఓ రిక్షావాలా మాత్రం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. తీరా పట్టాలు దాటే సమయంలో రిక్షా టైరు పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ రిక్షాను పక్కకు లాగేందుకు రిక్షావాలా ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యం కాలేదు. ఇంతలోనే రైలు రానే వచ్చింది. పట్టాల మధ్య ఇరుక్కున్న రిక్షాను ఢీకొని వెళ్లిపోయింది. రైలు ఢీకొనడంతో రిక్షా మొత్తం నుజ్జునుజ్జయ్యింది.

Also Read: టాయిలెట్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!


ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నుజ్జునుజ్జయిన రిక్షా వద్ద అంతా చేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Tags

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×