BigTV English

Mt Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన భారత నౌకాదళ జంట..

Mt Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన భారత నౌకాదళ జంట..

Indian Naval Couple Scaled Mt Kilimanjaro: భారతీయ నౌకాదళ జంట టాంజానియాలోని 19341 అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. టాంజానియాలోని ఈ పర్వతం ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరంగా ప్రసిద్ధి గాంచింది. ఈ జంటకు పర్వతారోహణ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.


గురువారం ఈ ఘనత సాధించినందుకు భారత నావికాదళం.. సీఎండీ దివియా గౌతమ్, సీఎండీ గౌరవ్ గౌతమ్ (రిటైర్డ్)ల జంటను అభినందించింది. 19341 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం & ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించినందుకు భారత నౌకాదళ జంట సర్గ్ సీఎండీ దివియా గౌతమ్ & సీఎండీ గౌరవ్ గౌతమ్ (రిటైర్డ్)లకు అభినందనలు తెలియజేస్తున్నట్లు నేవీ ప్రతినిధి తెలిపారు.

కాగా భారత నౌకాదళానికి చెందిన ఓ మహిళా అధికారి తొలిసారిగా ఈ ఘనత సాధించడం గమనార్హం.


కిలిమంజారో పర్వతం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతం ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం, దీని పొడవు దాదాపు 5,895 మీటర్లు (19,340 అడుగులు). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాండింగ్ పర్వతం , అంటే ఇది వేరే ఏ ఇతర పర్వత శ్రేణిలో భాగం కాదు.

కిలిమంజారో ఒక అద్భుతమైన సహజ దృగ్విషయం. ఇది సవన్నాకు అభిముఖంగా చుట్టుపక్కల మైదానాల పైన ఒంటరిగా ఉంది. ఇక కిలిమంజారో పర్వతంలో మొత్తం మూడు అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి కిబో, మావెన్జీ, షిరా.

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×