BigTV English

Open air Hotel: ఈ హోటల్‌కు తలుపులు ఉండవు.. సీలింగ్ ఉండవు.. ఆరు బయటే పడక!

Open air Hotel: ఈ హోటల్‌కు తలుపులు ఉండవు.. సీలింగ్ ఉండవు.. ఆరు బయటే పడక!

హోటల్ అంటే నాలుగు గోడల మధ్య ఉండే గదులు అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్త రకం ఓపెన్ ఎయిర్ హోటల్స్ వస్తున్నాయి. స్విట్జర్లాండ్ పర్వతాలపై గోడలు, పైకప్పు లేకుండా కేవలం కింద ఫ్లోర్ …ఆ ఫ్లోర్ పైన అందమైన మంచం చుట్టూ కళ్ళను కట్టిపడేసే కళాకృతులతో హోటల్ ఏర్పాటు చేశారు. రాత్రి అయితే ఆకాశంలో చందమామను, చుక్కలను చూస్తూ నిద్రపోవచ్చు. ఇది ఒక క్యాంపింగ్ లాంటిది.


ఒక్క రాత్రికి ఎంత ఖర్చు?
నల్ స్టెర్న్ హోటల్‌ను స్విట్జర్లాండ్ లోని పర్వతాలపై నిర్మించారు. 2016లో మొదటిసారి దీన్ని ప్రారంభించారు. అప్పుడు కేవలం ఒక్క బెడ్ తోనే దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ హోటల్ కు పెరుగుతున్న జనాదరణతో బెడ్ల సంఖ్య పెంచుకుంటూ వచ్చారు. సముద్రమట్టానికి 6463 అడుగుల ఎత్తులో ఉండే అందమైన ఓపెన్ ఎయిర్ హోటల్ ఇది. ఈ పచ్చని ప్రకృతిలో ఒక రాత్రి నిద్ర పోవాలంటే మీరు 210 స్విస్ ఫ్రాంక్ లను చెల్లించాలి. అంటే మన రూపాయల్లో 23 వేల రూపాయలు.

పర్వతాలపై పడక ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం ఒక నిర్మాణ బృందం భూమిని చదును చేసింది. ఎగుడు దిగుడుగా లేకుండా పూర్తి ఫ్లాట్ గా నేలను మార్చింది. చక్కగా ఫ్లోర్ వేసింది. గోడలు, పైకప్పు, బాత్రూం వంటివి మాత్రం ఉండవు. ఒక అందమైన మంచం.. ఆ మంచానికి రెండు వైపులా నైట్ లైట్ స్టాండ్లు ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ బాత్‌రూం… అంటే అర్జెంట్ అయితే పర్వతాలలో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి పోవడమే.


పెళ్లయిన కొత్త జంటలకు ఈ హోటల్ కచ్చితంగా నచ్చితీరుతుంది. పచ్చని ప్రకృతి మధ్య, విశాలమైన ఆకాశం కింద, నక్షత్రాల వెలుగులో నచ్చిన జీవిత భాగస్వామితో అరుదైన క్షణాలను పంచుకునేందుకు.. ఇంతకన్నా ఇంకేం కావాలి. అలాగే వారికి తగిన సేవలను ఆహారాన్ని ఇచ్చేందుకు వ్యక్తిగత బట్లర్ కూడా ఉంటారు. అతనే వారికి కావలసిన పానీయాలు, ఆహారాలను తయారు చేస్తాడు. అతడు ఓపెన్ హెయిర్ హోటల్ దగ్గరలోనే ఉన్న ఒక క్యాబిన్లో ఉంటాడు.

ఇక్కడ టీవీ కూడా ఉంటుంది. కానీ ఆ టీవీలో ఏమీ రావు, అది ఒక టీవీ ఫ్రేమ్ మాత్రమే. కేవలం ఆ బట్లర్ పేపర్ పట్టుకొని చదివేస్తూ ఉంటాడు. వాతావరణ సూచన, వార్తల్లోని ముఖ్యాంశాలు చదువుతాడు. టీవీలో చదివినట్టు అనిపించేందుకు చేతిలో టీవీ లాంటి ఫ్రేమ్ ను పట్టుకుంటాడు.

ఈ హోటల్ గదులు బుక్ చేసుకోవడం అంత సులువు కాదు. ఒకవేళ బుక్ చేసుకున్నా వాతావరణం సరిగా లేకపోతే చివరి నిమిషంలో వారి రిజర్వేషన్లను రద్దు చేస్తారు.

స్విస్ పర్వతాల మధ్య ఉన్న ఈ హోటల్ కి ఎంత ప్రజాదరణ పెరిగిందంటే బుకింగ్ కోసమే లిస్టులో 9,000 మంది దాకా ఉంటారు. ప్రకృతి ఒడిలో అందమైన అనుభవాన్ని ఎవరు మాత్రం వద్దనుకుంటారు.

ప్రైవసీ ఎలా?
ఇలా ఓపెన్ ఎయిర్ హోటల్లో జంటలు సమయం గడపడం వల్ల వారి ఏకాంత సమయాన్ని ఎవరైనా చూసే అవకాశం ఉందని ఎంతోమందికి అనుమానం రావచ్చు. రాత్రి అయితే అక్కడికి దగ్గరలో ఎలాంటి లైట్లు ఉండవు. వెలుగు కూడా ఉండదు. జంటలో తమ పక్కన ఉన్న నైట్ లాంప్ లను ఆఫ్ చేసుకోవాలి. అలాగే వీరికి ఆహారాన్ని ఇచ్చే బట్లర్ కూడా దూరంగా ఉండే క్యాబిన్లో నిద్రిస్తాడు. కాబట్టి వారి ఏకాంత సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Related News

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Big Stories

×