BigTV English

Shubhashree-Rayaguru: ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ నిశ్చితార్థం.. వరుడు బ్యాక్గ్రౌండ్ ఇదే!

Shubhashree-Rayaguru: ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ నిశ్చితార్థం.. వరుడు బ్యాక్గ్రౌండ్ ఇదే!

Shubhashree-Rayaguru:బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు (Shubha Sri Rayaguru) కూడా ఒకరు.. ఈమె బిగ్ బాస్ -7 సీజన్ లో హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్ తో హౌస్ లో చాలా బాగా రాణించింది. ముఖ్యంగా హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా శుభశ్రీకి సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా పలు ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ఇండస్ట్రీలో కూడా ఫేమస్ అయింది.అయితే అలాంటి శుభ శ్రీ రాయగురు తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. శుభ శ్రీ బిగ్ బాస్ 7 హౌస్ లో “మనోభావాలు దెబ్బతిన్నాయి” అనే ఒకే ఒక్క డైలాగ్ తో చాలా ఫేమస్ అయింది. అప్పటినుండి మనోభావాలు పాపగా శుభశ్రీ పిలవబడుతోంది కూడా.


నిశ్చితార్థం చేసుకున్న బిగ్ బాస్ శుభశ్రీ..

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటుడు,నిర్మాత.. ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. మరి ఇంతకీ శుభశ్రీ రాయగురు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం.. ఒడిస్సాకి చెందిన శుభశ్రీ రాయగురు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ -7 ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పలు ప్రైవేట్ సాంగ్స్ చేసి మరింత ఫేమస్ అయింది. ముఖ్యంగా రోల్ రైడాతో చేసిన ‘కాకినాడ కాజాలే రుచి చూపిస్తానంటా’ అనే ప్రైవేట్ సాంగ్ జనాలకి ఎంత కనెక్ట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క పాటతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చిన శుభశ్రీ రాయగురు.


ALSO READ:Namrata Shirodkar: గుడ్ న్యూస్.. త్వరలో నమ్రతా సినీ ఎంట్రీ..దాని ఫలితమేనా?

వరుడి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

తాజాగా ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది.శుభశ్రీ రాయగురు ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు ఇండస్ట్రీకి సంబంధించిన వాడే.. ఆయనే అజయ్ మైసూర్.. ఏజే మైసూర్ గా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈయన టెన్త్ క్లాస్ డైరీస్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాల ద్వారా ఫేమస్ అయ్యారు. అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే శుభశ్రీ రాయగురు , అజయ్ మైసూర్ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందంటే.. ఈ మధ్యనే వీరి కాంబోలో ‘మెసెస్టీ ఇన్ లవ్’ అనే కవర్ సాంగ్ వచ్చింది.ఈ సాంగ్ చేసే సమయంలోనే శుభ శ్రీ, అజయ్ మైసూర్ మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త పెళ్లి వరకు దారితీసింది.

ఇక కొద్ది రోజులు డేటింగ్ చేసిన శుభశ్రీ హ అజయ్ ఇద్దరు తాజాగా జూన్ 5న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఇక అజయ్ మైసూర్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను శుభశ్రీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈ విషయం కాస్త బయటపడింది. ఇక శుభశ్రీ షేర్ చేసిన ఫోటోలకు చాలామంది అభిమానులు,సెలబ్రిటీలు ఆమెకు విశేష్ తెలియజేస్తున్నారు.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×