గజరాజు ఎంత ప్రేమగా ఉంటుందో? అంత కోపంగా ఉంటుంది. ప్రేమిస్తే.. పైకి ఎక్కించుకుని తిప్పుతుంది. అదే కోపం వస్తే చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ, తాజాగా ఓ గజరాజు షాపింగ్ చేసింది. గజరాజు షాపింగ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ వీడియో చూసేయండి.
షాపింగ్ మాల్ లో ఏనుగు రచ్చ
తాజాగా థాయ్ లాండ్ లో ఈ ఘటన జరిగింది. సాయంకాలం సమయంలో ఓ గజరాజు నేరుగా షాపింగ్ మాల్ లోకి అడుగు పెట్టింది. సెక్యూరిటీ సిబ్బంది అడ్డు నిలిచినప్పటికీ, దాటుకుని లోపలికి వెళ్లిపోయింది. మాల్ లో కనిపించిన ఆకు కూరలు, కూరగాయాలు అన్నింటినీ తినేసింది. పప్పులు కూడా తినేందుకు ప్రయత్నించింది. ఆకు కూరలు తినే క్రమంలో మాల్ లోని ర్యాక్స్ అన్నింటినీ పడేసింది. కాయగూరలు, పండ్లను మొత్తం ఖాళీ చేసేసింది. మాల్ సిబ్బంది కూడా గజరాజును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే, ఒకవేళ దానికి కోపం వచ్చేలా చేస్తే, దాని రచ్చ ముందు తట్టుకోవడం కష్టం అని భావించారు. సుమారు అరగంటపాటు మాల్ లోనే ఉండిపోయింది. నచ్చిన వస్తువులు అన్నీ తిని నెమ్మదిగా బయటకు వెళ్లింది. ఈ అరగంట సేపట్లో మాల్ మాత్రం ఆగమాగం అయ్యింది. అయినప్పటికీ, యాజమాన్యం సదరు ఏనుగును పల్లెత్తు మాట కూడా అనలేదు. తనంతట తానే మాల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఏనుగు వెళ్లిన తర్వాత సిబ్బంది అంతా కలిసి మళ్లీ షాపింగ్ మాల్ అంతటినీ నీట్ గా సర్దుకున్నారు. గజరాజు షాపింగ్ కారణంగా వేల రూపాయలు నష్టపోయినట్లు మాల్ యాజమాన్యం ప్రకటించింది.
An #elephant 🐘 just strolled into a convenience store in #Thailand, raiding the shelves for fruits and snacks. 🤣 #wild #animal #funny #viral pic.twitter.com/RgtQ2yg0Ti
— Shanghai Daily (@shanghaidaily) June 5, 2025
Read Also: ఈ పక్షి మన ‘టిల్లు’ మూవీలో రాధిక టైపు.. గుడ్లు పెట్టడం వరకే దీని బాధ్యత.. తర్వాత?
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇక ప్రస్తుతం గజరాజు షాపింగ్ మాల్ కు వెళ్లిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. “వామ్మో గజరాజు షాపింగ్ చేస్తే ఇలా ఉంటుందా?” అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “మళ్లీ ఎప్పుడూ గజరాజ తమ షాపింగ్ మాల్ కు రాకూడదని యాజమాన్యం కోరుకుంటుంది కావచ్చు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఒక్కసారి అలవాటు పడితే, ఆ ఏనుగు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు తగినట్లుగా మాల్ యాజమాన్యం జాగ్రత్తలు చేపట్టాలి. లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “యాజమాన్యం చాలా సౌమ్యంగా వ్యవహరించింది. ఎలాంటి దాడి చేయకుండా, కావాల్సిన ఆహారం తీసుకునేలా సపోర్టు చేశారు. షాపింగ్ మాల్ వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నా” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అటు మరోసారి గజరాజు షాపింగ్ మాల్ లోకి రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మాల్ యాజమాన్యం ప్రకటించింది. అధికారులు నగరంలో ఏనుగులు ఇష్టారీతిన వచ్చేలా రాకుండా చేయాలని కోరారు.
Read Also: దేశంలో అత్యధిక వ్యభిచారం కలిగిన టాప్ 5 స్టేట్స్ ఇవే.. తెలుగు రాష్ట్రాలు ఏ ప్లేస్ లో ఉన్నాయంటే?