Nature Facts: ఈ ప్రకృతి ఓ మహాద్భుతం. మనకు తెలియని ఎంతో వింతలు, విశేషాలు ఈ ప్రకృతిలో దాగి ఉన్నాయి. చెట్లు కమ్యూనికేట్ చేయడం, అమెజాన్ చెట్లు తమ తామే కురిపించుకోవడం వంటి ఎన్నో వింతలు ఉన్నాయి. వీటిల్లోని టాప్ 10 నేచర్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం.
1.అమెజాన్.. తన వర్షాన్ని తానే కురిపిస్తుంది
అమెజాన్‌లోని చెట్లు ట్రాన్స్పిరేషన్ ద్వారా వాతావరణంలోకి నీటిని విడుదల చేస్తాయి. దీనివల్ల ఏర్పడే మేఘాలు వర్షంగా మారి అమెజాన్ అడవి తేమగా ఉంచుతాయి. అమెజాన్ లో చెట్లు కొట్టేయడంతో.. ట్రాన్స్పిరేషన్ ప్రక్రియ బలహీనపడుతుంది.
2.చెట్లు మాట్లాడుకుంటాయ్
అడవులలోని చెట్లు నేలలోని ఫంగస్ నెట్‌వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు. ఈ నెట్‌వర్క్‌ను పోషకాలను పంచుకోవడానికి, తెగుళ్ల గురించి హెచ్చరించడానికి ఉపయోగిస్తాయి.
3.సముద్రం కింద సరస్సులు
సముద్రపు అడుగుభాగంలోని కొన్ని ఏరియాల్లో, సముద్రపు నీటితో కలవని సరస్సులు ఉన్నాయి. కొన్ని సరస్సుల్లో అలలు కూడా వస్తుంటాయి.
4.ఎవరెస్ట్ ఇంకా పెరుగుతూనే
భారత్, యురేషియన్ ప్లేట్స్ మధ్య టెక్టోనిక్ ఢీకొనడం కారణంగా, ఎవరెస్ట్ పర్వతం ప్రతి ఏడాది సుమారు 4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూనే ఉంది.
5.భూమిపై అతి పెద్ద చెట్లు
కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్‌లో ఉన్న జనరల్ షెర్మన్ ట్రీ, భూమిపై తెలిసిన అతిపెద్ద చెట్టు. దీని బరువు సుమారు 2.7 మిలియన్ పౌండ్లు.
6.సహారా ఎడారి పచ్చగా
సుమారు 6,000 సంవత్సరాల క్రితం సహారా ఏడారి ప్రాంతం నదులు, సరస్సులు, వన్యప్రాణులు, పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది.
7.అధిక ఆక్సిజన్ సముద్రాల నుంచి
సముద్రాల్లోని ఫైటోప్లాంక్టన్ ప్రపంచంలోని ఆక్సిజన్‌లో 50% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. వరల్డ్ ఆక్సిజన్ సైకిల్ లో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
8.భూమిపై 3 శాతం మాత్రమే మంచినీరు
భూమిపై 71 శాతం నీరు ఉంది. కానీ ఈ నీటిలో కేవలం 3% మాత్రమే మంచినీరు. ఇందులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లేషియర్స్, ఐస్ కాప్స్ నుంచి వస్తుంది.
9. తమను తింటున్న విషయం మొక్కలకు తెలుసు
గొంగళి పురుగులు ఆకులను కొరకడం వల్ల వచ్చే వైబ్రేషన్స్ ను బట్టి కొన్ని మొక్కలు రక్షణ రసాయనాలను విడుదల చేస్తాయి. తమను తింటున్న విషయాన్ని అవి తెలుసుకుంటాయి.
10.చెట్లు నిద్రపోతాయి
జంతువుల మాదిరిగానే, చెట్లకు కూడా ఒక రకమైన లైఫ్ సైకిల్ ఉంటుంది. అవి రాత్రిపూట నిద్ర దశలోకి వెళ్తాయి. ముఖ్యంగా చీకటి వేళల్లో ఎనర్జీని ఆదా చేసుకోవడానికి వాటి కొమ్మలు, ఆకులు కొద్దిగా వంచుతాయి.
Also Read: పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?