E-Paper
Advertisement

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 33,960 జీతం, తెలంగాణ స్త్రీ నిధిలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 33,960 జీతం, తెలంగాణ స్త్రీ నిధిలో ఉద్యోగాలు
Advertisement

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గోల్డెన్ ఛాన్స్ కల్పించింది. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్ కార్యకలాపాల కోసం 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ప్రోత్సహిస్తున్న ఈ సంస్థలో చేరాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేవలం డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఈ ఉద్యోగ నోటిపకిేషన్ కు సంబంధించిన వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 123

Advertisement

రిజర్వేషన్ల వారీగా ఖాళీలు: మొత్తం 123 ఖాళీలలో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు కల్పించారు. ఓసీలకు 60, ఎస్సీలకు 30, బీసీలకు 18, దివ్యాంగులకు 9, ఎస్టీలకు 3, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. విద్యార్హతలో ఓసీ అభ్యర్థులు 65 శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 55 శాతం మార్కులు కలిగి ఉండాలి.

Advertisement

నోట్: అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండటంతో పాటు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office) ఉండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు.

వయస్సు:  దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం.. బీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 33,960 వేతనం లభిస్తుంది. ఇందులో ప్రయాణ అలవెన్సులతో పాటు పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్ పే కూడా కలిసి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉన్నందున అభ్యర్థులు సొంతంగా ద్విచక్ర వాహనం కలిగి ఉండటంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.

ఉద్యోగ ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, బ్యాంకింగ్ రంగంతో కూడిన జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షా సమయం 90 నిమిషాలుగా నిర్ణయించారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి వంటి ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి గల అభ్యర్థులు స్త్రీ నిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 29వ తేదీ రాత్రి 12 గంటల లోపు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ. 770, ఇతరులకు రూ. 885 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులని.. ఇవి ప్రభుత్వ లేదా శాశ్వత ఉద్యోగాలు కావని సంస్థ స్పష్టం చేసింది.

అభ్యర్థులు తమ సొంత జిల్లాలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు నెలకు కనీసం 20 రోజుల పాటు ఫీల్డ్ టూర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో 10 శాతం పోస్టులను స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా కేటాయించారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.streenidhi.telangana.gov.in/

ALSO READ: బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. రూ.1,80,000 వరకు జీతం, APPLY NOW

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×