E-Paper
Advertisement

China Manja Video: లైవ్ వీడియో.. చైనా మాంజా ఎలా కోసేసిందో చూడండి, బైకర్‌కు ఏమైందంటే?

China Manja Video: లైవ్ వీడియో.. చైనా మాంజా ఎలా కోసేసిందో చూడండి, బైకర్‌కు ఏమైందంటే?
Advertisement

China Manja Video: చైనా మాంజా ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. దిల్లీలో బైక్ వెళ్తున్న ఓ యువకుడి మెడకు మాంజా చుట్టుకుంది. బైకర్ అప్రమత్తతతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన వీడియోలో రికార్డైంది. షాబుద్దీన్ అన్సారీ తన బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా చైనా మాంజా మెడకు చుట్టుకుంది. వీడియోలో అన్సారీ తన బైక్ ను ఆపి మెడకు చుట్టుకున్న మాంజాను జాగ్రత్తగా తీసివేసి, ఆపై తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తనకు జరిగి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు.

తృటిలో తప్పిన ప్రమాదం

“చైనా మాంజా ప్రమాదం నుంచి నేను తృటిలో తప్పించుకున్నాను. దేవుని దయ వల్ల, నాకు ఏమీ జరగలేదు” అని అన్సారీ వీడియో పోస్టు చేశాడు. వీడియోలో మాంజా వలన తన షార్ట్ ఎలా చిరిగి పోయిందో చూపించాడు. మందంగా ఉన్న వైర్ కు గాజు పొడిని అద్దుతారని, అందుకే మాంజా చుట్టుకున్న వెంటనే గాయం అవుతుందని తెలిపాడు. అదృష్టవశాత్తూ తనకు చిన్న గాయమే అయిందని, పెను ప్రమాదం తప్పిందన్నాడు.

Advertisement

మాంజా వల్ల తన హెల్మెట్ పట్టీ దెబ్బతిన్నట్లు వీడియోలు చూపాడు అన్సారీ. హెల్మెట్ ఉండడం వల్ల తనకు తీవ్రమైన గాయం అవ్వలేదన్నారు. తన బైక్ డాష్‌ క్యామ్ లో జరిగిన సంఘటన రికార్డు అయిందన్నాడు.

?utm_source=ig_web_copy_link

Advertisement

Also Read: అంతా చూస్తుండగా.. మెట్రో స్టేషన్‌లో మూత్రం పోసిన ప్రయాణికుడు

గాజు పొడితో మాంజా తయారీ

చైనీస్ మాంజా అనేది గాజు పొడితో పూత పూయబడిన సింథటిక్.. గాలిపటాలను ఎగురవేసే కాటన్ దారం కంటే చాలా పదునుగా, బలంగా ఉంటుంది. తెగిన గాలి పటాల మాంజా రోడ్లపై వేలాడుతూ వాహనదారులకు ఎంతో ప్రమాదం మారుతున్నాయి. ఒక్కసారిగా మెడకు చుట్టుకుని తీవ్రగాయాలైన సందర్భాలు లేకపోలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×