E-Paper
Advertisement

Oil India: ఆయిల్ ఇండియాలో భారీ కొలువులు.. నెలకు రూ. 90,000 వరకు జీతం.. గోల్డెన్ ఛాన్స్!

Oil India: ఆయిల్ ఇండియాలో భారీ కొలువులు.. నెలకు రూ. 90,000 వరకు జీతం.. గోల్డెన్ ఛాన్స్!
Advertisement

ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరమైన ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం కోరుకునే నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 2026 సంవత్సరానికి గాను భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 421 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్ వంటి ట్రేడ్ విభాగాలతో పాటు మొత్తం 22 రకాల కేటగిరీల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 421

Advertisement

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతభత్యాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్రేడ్-III కేటగిరీ పోస్టులకు నెలకు రూ. 26,600 నుండి రూ. 90,000 వరకు, గ్రేడ్-V కేటగిరీ పోస్టులకు రూ. 32,000 నుండి రూ. 1,27,000 వరకు వేతనం లభిస్తుంది. అన్ని రకాల అలవెన్సులు కలుపుకుంటే వార్షిక ప్యాకేజీ దాదాపు రూ. 17 నుండి 18 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా.. శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ. 56,100 చొప్పున స్టైపెండ్ కూడా అందిస్తారు.

అభ్యర్థుల వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. సాధారణంగా కనీసం 18 ఏళ్ల నుండి గరిష్టంగా 33 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. కొన్ని ప్రత్యేక పోస్టులకు అక్టోబర్ 1, 2026 నాటికి 20 నుండి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, EWS, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనరల్, OBC అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇతరులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

Advertisement

ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్ తయారీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 7 నుండి జనవరి 30 లోపు ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు గడువు ముగియక ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి16 నుంచి ఎగ్జామ్స్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×