BigTV English

Free First Night viral vedio: ఏకంగా ప్రీ ఫస్ట్ నైట్ షూట్..పిచ్చికి పరాకాష్ట

Free First Night viral vedio: ఏకంగా ప్రీ ఫస్ట్ నైట్ షూట్..పిచ్చికి పరాకాష్ట

Trending news viral in social media..pre first night shoot
కొంత మందికి పబ్లిసిటీ పిచ్చి..సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి..కావలసినంత వినోదం పంచడానికి వీళ్లు ఎంతకైనా తెగిస్తారు. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాన్ని కూడా వీళ్లు పబ్లిక్ గా మార్చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రీ వెడ్డింగ్ షూట్ లు చాలానే చూసుంటారు మీరు..పచ్చని పొలాలు, జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య రొమాంటిక్ హీరోహీరోయిన్స్ ను మరిపించేలా కొత్ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు అందంగా అలంకరించుకుని ఫొటో షూట్స్ చేయించుకుంటున్నారు.


చంద్రమండలంపైనా వెడ్డింగ్ షూట్

అవకాశం ఇవ్వాలే కానీ చంద్ర మండలంపైనా ప్రీ వెడ్డింగ్ జరుపుకుంటారు ఈ తరహా జంటలు. వివాహ మహోత్సవం జీవితంలో ఒక్కసారే వస్తుందంటూ పాన్ ఇండియా సినిమా లెవెల్ లో కోట్లు ఖర్చుపెట్టేసి ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. వీళ్ల వెడ్డింగ్ షూట్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు సామాన్యులు. ప్రీ వెడ్డింగ్ కే ఇన్ని కోట్లు తగలేస్తున్నారంటే..ఇక పెళ్లికి ఎంత ఖర్చుపెడతారో అని అనుకుంటున్నారు అంతా. రీసెంట్ గా ప్రపంచమే అచ్చెరువొందేలా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అవన్నీ పక్కన పెడితే ఓ యువ జంట అందరి కన్నా భిన్నంగా ఆలోచన చేసింది. తాము చేసే పని సంచలనం క్రియేట్ చేయాలని అనుకున్నారు. వాళ్లకు వచ్చిన ఆలోచనను వీడియో రూపంలో సోషల్ మీడియాకి వదిలారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.


ఏముంది అక్కడ?

అంతగా సంచలనం క్రియేట్ చేసిన ఆ వీడియోలో విషయం ఏమై వుంటుందా అని కదా మీ సందేహం..అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటూ పెళ్లి వేడుకలు ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటే ఓ యువ జంట ప్రీ ఫస్ట్ నైట్ షూట్ అంటూ ఓ వీడియోను చేసి జనం మీదకు వదిలారు. ఇంకేముంది ఇదేదో రియాలిటీ శృంగార వీడియో అనుకుని నెటిజన్స్ ఆ వీడియోను ఆత్రంగా చూసేస్తున్నారు. తెలుగు సినిమాలలో ఫస్ట్ నైట్ సన్నివేశాల స్ఫూర్తితో ఈ ప్రీ వెడ్డింగ్ సీన్స్ తీసినట్లు కనిపిస్తోంది. వధువు పాల గ్లాసుతో సిగ్గు పడుతూ లోపలికి రావడం ఆ గ్లాసు పాలు వరుడు తాగి సగం ఇవ్వడం..గదంతా పూలు, పళ్లు డెకరేషన్స్, అగరుబత్తి పొగ ఎఫెక్ట్ సింపుల్గా ఇంతే..ఇంకేదో జరుగుతుందని ఎదురుచూసిన వీక్షకులకు చివరకు ఏదీ జరగలేదని నిట్టూర్పు విడవడం తప్ప అంతకు మించి ఆ వీడియోలో ఏదీ లేదు. అది చూసిన నెటిజన్స్ తీవ్ర అసంతృప్తితో కామెంట్స్ చేస్తున్నారు.

శృంగార ప్రియులు అప్ సెట్

ఇంతోటి వీడియోలు తెలుగు సినిమాలలో అంతకు మంచే ఉన్నాయి. దీనికీ మీరేదో కొత్తగా పేరు పెట్టి ప్రీ ఫస్ట్ నైట్ అంటూ జనాన్ని మోసం చేయడం ఏమీ బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ జంటను మనసారా దీవిస్తున్నారు. ఓ సినిమాలో ఎమ్మెస్ నారాయణ పాపులర్ డైలాగ్ ఉంటుంది..జ్యోతిలక్ష్మి పాటలా కనిపించీ కనిపించకుండా..వినిపించీ వినిపించకుండా అంటూ అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి అంటాడు. అలానే ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వీడియో అయిపోవడంతో శృంగార ప్రియులు అప్ సెట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×