Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఐదో రోజు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 19 పద్దులపై చర్చిస్తున్నారు. ఆర్థిక నిర్వహణ, అర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. దీంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషణ్, అర్బన్ డెవలప్ మెంట్, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య,మెడికల్ అండ్ హెల్త్… ఇలా మొత్తం 19పద్దులపై చర్చించిన తర్వాత శాసనసభ ఆమోదం తెలపనుంది.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు ఈ పద్దును సభలో ప్రవేశపెట్టారు. పద్దుల్లో చర్చ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు.