BigTV English

TRAI Consultation Paper: కేంద్రం గుడ్ న్యూస్.. చిక్కుల్లో టెలికాం కంపెనీలు.. భారీగా తగ్గనున్న రీఛార్జ్‌లు!

TRAI Consultation Paper: కేంద్రం గుడ్ న్యూస్.. చిక్కుల్లో టెలికాం కంపెనీలు.. భారీగా తగ్గనున్న రీఛార్జ్‌లు!

TRAI Consultation Paper: దేశంలోని కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు త్వరలో పెద్ద శుభవార్త అందుబోతున్నారు. మరోసారి మొబైల్ రీఛార్జ్‌లు చాలా చౌకగా ఉండబోతున్నాయి. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) పూర్తి సన్నాహాలు చేసింది. టెలికాం రెగ్యులేటర్ ద్వారా ఒక కన్సల్టేషన్ నోటీస్ జారీ చేసింది. దీనిలో కేవలం కాలింగ్, ఎస్‌ఎమ్ఎస్‌కి మాత్రమే ఉన్న ప్లాన్‌లకు సంబంధించి టెలికాం రంగానికి చెందిన వాటాదారుల నుండి సలహాలను కోరింది. అన్ని టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచడంతో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. TRAI సూచనలను తర్వాత రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు తగ్గే అవకాశం ఉంది.


టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (TCPR) 2012పై ఈ కన్సల్‌టేషస్ నోటీస్‌ని TRAI విడుదల చేసింది. TRAI దీనిలో వాటాదారుల నుండి అభిప్రాయాలను కోరింది. దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. టెలికాం కంపెనీలు ఒక్కసారిగా మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచడం కారణంగా దేశంలోని కోట్లాది మంది వినియోగదారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

Also Read: Hyundai Exter Hy CNG Duo: హ్యుందాయ్ నుంచి CNG.. 27 కిమీ మైలేజ్.. ప్రైస్ ఎంతంటే?


వాయిస్, డేటాతో పాటు ఎస్‌ఎమ్‌ఎస్, ఓటీటీ బెనిఫిట్స్ అందించే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అలానే దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కంపెనీ ఇందులో ఉన్నాయి. ఇవి చాలా బండిల్ టారిఫ్ ప్లాన్‌లలో ఆఫర్ చేస్తున్నాయి. TRAI తన కన్సల్టేషన్ పేపర్‌లో,టెలికాం ఆపరేటర్లకు వోచర్ల కలర్ కోడింగ్ జారీ చేయాలని ప్రతిపాదించింది.

టెలికాం కంపెనీలతో TRAI కన్సల్టేషన్ పేపర్‌ డిజిటల్ మీడియా కలర్ కోడింగ్ సరైన స్టెప్ కాదా అని ఈ ప్రశ్నించారు. దీని కోసం వాటాదారులు 16 ఆగస్టు 2024లోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. దీని తర్వాత 23 ఆగస్టు 2024లోగా దీనికి వ్యతిరేకంగా కౌంటర్ రెస్పాన్స్ ఇవ్వవచ్చు. సమాచారం కోసం  TRAI కన్సల్టేషన్ పేపర్‌ ద్వారా అన్ని సమస్యలపై వాటాదారుల అభిప్రాయాన్ని కోరుతుంది.

Also Read: Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?

తమకు అవసరం లేని ప్లాన్‌లను తీసుకోవాలని టెలికాం కంపెనీలు తమను బలవంతం చేస్తున్నాయని కస్టమర్లు నిరంతరం ఆరోపిస్తున్నారని TRAI తెలిపింది. టెలికాం వినియోగదారుల రక్షణ చట్టాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందా లేదా అనే సలహాలను ఈ పేపర్‌లో కోరింది. దీనితో పాటు కొత్త టారిఫ్ ప్లాన్‌ను ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×