Bride Threatens Husband: అలా పెళ్లి జరిగింది. ఇలా పెళ్లి కొడుకు అసలు కార్యానికి సిద్ధమయ్యాడు. తెగ సంబర పడుతూ తలుపులు మూశాడు. నూతన వధువు వద్దకు వెళ్లాడు. ఇక అంతే మనోడి ఆశలు గల్లంతయ్యాయి. పాపం.. ఏదో అనుకుంటే ఏదేదో జరిగింది. చివరికి మనోడి ఆశలు గల్లంతే. అంతేకాదు 35 ముక్కలు చేస్తానంటూ నూతన వధువు ఇచ్చిన షాక్ కు నూతన వరుడి పంచె తడిసింది. ఇక అంతే పలాయనం పరుగులు తీసి , అసలు విషయం చెప్పాడు. ఇంతకు నూతన వధువు ఫస్ట్ నైట్ రోజు ఎందుకు వార్నింగ్ ఇచ్చింది.. అసలు కథ తెలుసుకుంటే ఔరా అనేస్తారు. మొత్తం మీద ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన ఓ యువకుడికి, స్థానిక యువతినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తంతు సందడిగా జరిగింది. బంధువులు వచ్చారు.. నిండు నూరేళ్లు ఈ జంట ఆనందంగా ఉండాలని దీవించి మరీ వెళ్ళారు. దీనితో అంతా సందడి వాతావరణం నెలకొంది.
ఆ తర్వాత జరిగింది ఇదే..
పెళ్లి తంతు తర్వాత ఇక అసలు కార్యం ఉంది కదా.. అందుకు పెళ్లి కొడుకు సిద్ధమయ్యాడు. ఫస్ట్ నైట్ కు అంతా సిద్ధమైంది. పెళ్ళికొడుకు హుషారుగా గదిలోకి వెళ్లాడు. ఇంకేముంది పట్టుమని 15 నిమిషాలకే పరుగులు పెడుతూ బయటకు వచ్చాడు. దీనితో అసలు విషయం చెప్పిన పెళ్ళికొడుకు మాటలు విని అంతా కంగారు పడ్డారు.
లోపల ఏం జరిగిందంటే?
పెళ్లి కుమారుడు ఫస్ట్ నైట్ అంటూ లోపలికి వెళ్లగా, వధువు ఏకంగా పాల గ్లాసు బదులు కత్తి పట్టుకొని స్వాగతం పలికింది. తనను ముట్టుకుంటే ఇదే కత్తితో 35 ముక్కలు చేస్తానంటూ బెదిరించింది.
Also Read: IT Companies in Vizag: బెంగుళూరుకు ఎందుకు? విశాఖలోనే భారీగా ఐటీ జాబ్స్.. మీరు రెడీనా!
ఇలా ఎందుకంటే?
వధువు అలా కత్తి పట్టుకొని బెదిరించడం వెనుక పెద్ద కథే ఉందని వరుడు తెలిపాడు. సదరు వధువు మరొకరిని ప్రేమించిందని, అందుకు తనను తాకితే చంపడం ఖాయమని తెగేసి చెప్పిందట వధువు. అందుకు వరుడు కూడా సైలెంట్ గా గది బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరకు..
మొత్తం మీద ఆ పెళ్లి కుమార్తె మాత్రం తన పంతం నెరవేర్చుకుంది. ఎట్టకేలకు కొద్ది రోజులకు తన ప్రియుడితో ఆమె వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇంత పెళ్లి ఖర్చు ఎందుకు? అదేదో ముందే ప్రియుడితో వెళ్ళి పోవాల్సింది అంటూ కొందరు కుటుంబసభ్యులు అంటుండగా, ఏమో పెద్ద గండమే తప్పింది.. లేకుంటే 32 ముక్కలు చేసేదేమో అంటూ సదరు వరుడు ఊపిరి పీల్చుకున్నాడట. మొత్తం మీద ఈ ఘటనను బట్టి ఫస్ట్ నైట్ కు వెళ్లే ముందు ఆ గదిలో కత్తులు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు నెటిజన్లు.. కొత్తగా పెళ్లైన నూతన వరుళ్లకు!