OTT Movie : మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ కి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ‘పుష్ప’ సినిమా తరువాత పాన్ ఇండియా లెవెల్ లో తన కంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. అన్ని పాత్రల్లో ఇట్టే ఇమిడిపోయే నటన అతని సొంతం అనే చెప్పుకోవాలి. అంతలా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతను నటించిన ఒక మూవీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో కేక పెట్టించింది. చివరి వరకూ ఈ సినిమా సస్పెన్స్ తో, నెక్స్ట్ ఎం జరుగుతుందనే ఆతృతను పెంచుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (YouTube) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘1 బై టూ’ (1 by two). 2014 లో వచ్చిన ఈ సినిమాకి అరుణ్ కుమార్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫహద్ ఫాసిల్, మురళి గోపి , హనీ రోజ్, అభినయ, శ్యామప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక జంట కవలలైన ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 5.3/10 రేటింగ్ ఉంది. యూట్యూబ్ (YouTube) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ బెంగళూరులో హరి నారాయణన్, రవి నారాయణన్ అనే కవల సోదరుల చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరు సోదరులకు ఒకరిమీద ఒకరికి చాలా అభిమానం ఉంటుంది. హరి ఒక వైద్య వృత్తిలో ఉండగా, రవి ఒక కథకళి కళాకారుడిగా ఉంటాడు. సంతోషకరంగా ఉన్న వీళ్ళ లైఫ్ఇ, ఒక్కసారిగా విషాదకరమైన ప్రమాదంతో మలుపు తిరుగుతుంది. ఇందులో హరి ఒక కారు ప్రమాదంలో మరణిస్తాడు. ఈ సంఘటన రవిని తీవ్రమైన మానసిక వేదనకి గురిచేస్తుంది. రవి మానసిక స్థితి, అతని చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతో, బెంగళూరు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ యూసుఫ్ మరిక్కర్ (ఫహద్ ఫాసిల్) ఈ కేసును దర్యాప్తు చేయడానికి నియమించబడతాడు. యూసుఫ్ తన భార్యతో (అభినయ) జీవితాన్ని గడుపుతూ, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తాడు.
ఈ దర్యాప్తులో హరి మరణం చుట్టూ అనేక రహస్యాలు తెరపైకి వస్తాయి. హరి, రవి ల తండ్రి, ఒక ధనవంతమైన వ్యాపారవేత్త. కేసును చట్టపరమైన ఫార్మాలిటీల నుండి తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఇది యూసుఫ్‌కు మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది. రవి మానసిక స్థితి, కథకళి కళాకారుడిగా ఉన్న అతని గతం, హరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ స్టోరీని ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి. హరి మరణం వెనుక ఉన్న నిజం, రవి సైకోసిస్, వీళ్ళ కుటుంబ రహస్యాలు యూసుఫ్ దర్యాప్తులో క్రమంగా బయటపడతాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది. చివరికి హరి మరణానికి కారణం ఎవరు ? ఇన్స్పెక్టర్ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : రాత్రిపూట గోర్లు కట్ చేసుకుంటే ఈ దెయ్యానికి బలి… చలికాలంలో కూడా చెమటలు పట్టించే హర్రర్ మూవీ