BigTV English

Viral News: బిచ్చగాడితో లవ్.. ఆరుగురు పిల్లల తల్లి జంప్..

Viral News: బిచ్చగాడితో లవ్.. ఆరుగురు పిల్లల తల్లి జంప్..

Viral News: రోజూ భిక్షం కోసం వచ్చేవాడు. ఆ ఇంటి మహిళ ప్రతిరోజూ భిక్షమేసేది. అలా వారిద్దరి మధ్య మాట కలిసింది. ఆ మాటలు స్నేహానికి దారి తీశాయి. ఆ స్నేహం ప్రేమగా మారింది. చివరకు మేము వయసుకు వచ్చాం అంటూ వారిద్దరూ జంప్ అయ్యారు. ఈ రియల్ స్టోరీలో మరో విశేషం ఏమిటంటే.. ఆ మహిళకు ఆరుగురు సంతానం.


తమ తల్లి ఎక్కడికి వెళ్లిందో తెలియని వయస్సులో ఆ పిల్లలు, తండ్రి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పెళ్లైన మహిళ, బిచ్చగాడితో వెళ్లిపోయినట్లు తెలియడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో సదరు విషయం బయటకు రాగా, స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో..!

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో రాజు, రాజేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఆరుగురు పిల్లలు సంతానం. కూలీనాలీ పనులు చేసుకుంటూ రాజు, తన కుటుంబపోషణ సాగిస్తున్నాడు. ఈ సంసారం సంతోషంగా సాగుతున్న వేళ, వీరి కుటుంబంలోకి ఓ బిచ్చగాడు ఎంటరయ్యాడు.


నానే పండిత్ అనే బిచ్చగాడు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. అలా రోజూ రాజు ఇంటి వద్దకు కూడ వచ్చేవాడు. రాజు భార్య రాజేశ్వరి అతనికి భిక్షమేసేది. అలా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ మాటలలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రోజూ భిక్షం కోసం రావడం, ఆ మహిళతో మాటలు సాగిస్తూ ఉండేవాడు భిక్షగాడు. ఒకరోజు ఇద్దరూ.. వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక అంతే తన ఆరుగురు బిడ్డలను వదిలి, ఆ మహిళ వెళ్లి పోయింది.

Also Read: RRB Recruitment: రైల్వేలో భారీగా వేకెన్సీలు.. ప్రారంభ వేతనం రూ.40,000.. మీకు ఈ అర్హత ఉంటే చాలు..!

భర్త ఇంటికి వచ్చి చూడగానే, భార్య కనిపించక పోవడంతో అసలు విషయాన్ని గ్రహించాడు. గాలింపు చేసి చివరకు బిచ్చగాడితో కలిసి తన భార్య లేచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కూడ నివ్వెరపోయారు. వెంటనే వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏదిఏమైనా ఆరుగురు సంతానం గల మహిళ, ఓ భిక్షగాడితో ప్రేమలో పడి వెళ్లిపోవడం గురించి అక్కడంతా హాట్ టాపిక్ గా మారింది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు మాత్రం, నాన్నా.. అమ్మ ఎక్కడా అంటూ తండ్రిని అడుగుతున్న తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది.

Related News

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Big Stories

×