BigTV English

Palakura Khichdi: పాలకూర కిచిడి వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు, పైగా ఎంతో ఆరోగ్యం

Palakura Khichdi: పాలకూర కిచిడి వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు, పైగా ఎంతో ఆరోగ్యం
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా దీన్ని ఇష్టంగా తినే వారి సంఖ్య తక్కువే. పాలకూరని తినడం వల్ల పోషకాహార లోపాలు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలకూరతో చేసే రెసిపీలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మేము పాలకూరతో చేసే కిచిడి రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినవచ్చు. పాలకూర కిచిడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


పాలకూర కిచిడి రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర – మూడు కట్టలు
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – తగినంత
ఉల్లిపాయ – ఒకటి
జీలకర్ర – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
పచ్చిమిర్చి – మూడు
ఎండుమిర్చి – రెండు
వెల్లుల్లి రెబ్బలు – మూడు
పసుపు – ఒక స్పూన్
పెసరపప్పు – ఒక కప్పు
బియ్యం – ఒక కప్పు

పాలకూర కిచిడి రెసిపీ
1. పాలకూర కిచిడి చేయడానికి ముందుగానే బియ్యాన్ని, పెసరపప్పును నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాలకూరను సన్నగా తరిగి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.
4. అందులో పాలకూరను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
5. ఈ పాలకూరను చల్లబరిచి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి బియ్యము ,పెసరపప్పు రెండు కప్పుల నీరు, చిటికెడు పసుపు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
8. అది వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి.
9. తర్వాత ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
10. అలాగే ఒక స్పూన్ ఉల్లిపాయ తరుగును కూడా వేసి వేయించుకోవాలి.
11. గుప్పెడు కరివేపాకులను కూడా వేసి వేయించాలి.
12. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్టును కూడా వేసి బాగా కలపాలి.
13. ఇందులో ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
14. ఇది కిచిడీ లాగా ఉడికిన తర్వాత ఒక స్పూను నెయ్యిని వేసి ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
15. అంతే టేస్టీ పాలకూర కిచిడి రెడీ అయినట్టే.

పాలకూరలో పోషకాలు నిండుగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా పాలకూర అంతా మేలే చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు పాలకూరను తరచూ తినడం మంచిది. పాలకొరకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. కాబట్టి వారంలో ఒకసారైనా పాలకూరను తినాల్సిన అవసరం ఉంది. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల వారి చర్మ సౌందర్యం మెరుగవుతుంది.


Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×