BigTV English

Naga Chaitanya: బాహుబలి మేకర్స్ తో చేయి కలిపిన చైతూ.. ఈసారి ఏకంగా భయపెట్టడానికి సిద్ధం..!

Naga Chaitanya: బాహుబలి మేకర్స్ తో చేయి కలిపిన చైతూ.. ఈసారి ఏకంగా భయపెట్టడానికి సిద్ధం..!

Naga Chaitanya: ఈ ఏడాది బిజీయెస్ట్ హీరోలలో నాగచైతన్య (Naga Chaitanya)ఒకరిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన క్రేజీ లైనప్ తో కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేశారు. గత ఏడాది రెండవ పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, ఈ ఏడాది పూర్తిగా సినిమాలతో బిజీబిజీగా గడపబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది నాగచైతన్యకు కలిసిరాబోతున్న సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ‘తండేల్’ విడుదల కాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుండడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, ప్రమోషనల్ పోస్టర్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.


బాహుబలి మేకర్స్ తో సినిమాకి సిద్ధమైన నాగచైతన్య..

ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య మరో కొత్త సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి(Bahubali )మేకర్స్ తో నాగచైతన్య చర్చలు జరిపారని, త్వరలోనే కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు.ఎందుకంటే నాగచైతన్య కి ఇప్పటివరకు అంత గుర్తింపు అయితే లేదు. తండేల్ మూవీతో గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమా గుర్తింపుతో పాటు బాహుబలి మేకర్స్ అయినటువంటి ‘ఆర్కా మీడియా’లో నాగచైతన్య సినిమా చేస్తే మాత్రం హిట్ సాధించినట్టే అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే బాహుబలి మేకర్స్ అయినటువంటి ఆర్కా మీడియా సంస్థలో ఇప్పటికే బాహుబలి-1, బాహుబలి-2, వేదం, మర్యాద రామన్న వంటి సినిమాలు వచ్చి భారీ హిట్ కొట్టాయి. ఇక నాగచైతన్య కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ తో చేతులు కలిపి సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్టే అని భావిస్తున్నారు.


హార్రర్ కామెడీ జానర్ లో మూవీ..

ఇదిలా ఉండగా మరోవైపు ఆర్కా మీడియా గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అయింది. సీరియల్స్, వెబ్ సిరీస్ లు తప్ప సినిమాలు తెరకెక్కించడం లేదు. ఆ మధ్యకాలంలో ఆర్కా మీడియా సంస్థ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ వంటి రెండు సినిమాలను రాజమౌళి (Rajamouli) సమర్పణలో అనౌన్స్ చేసినప్పటికీ, అవి ఎక్కడి వరకు వచ్చాయో కూడా తెలియడం లేదు. అయితే ఈ ఏడాది నాగచైతన్యతో ఆర్కా మీడియా హార్రర్, కామెడీ సినిమా తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నాగచైతన్య సినిమాతో డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ చర్చలు సఫలమైతే గనుక నాగ చైతన్య ఖాతాలో క్రేజీ సినిమా పడ్డట్లే.

తండేల్ సినిమా హిట్ అయితే ..

ఇక నాగచైతన్య కి ఆర్కా మీడియా సంస్థ వారి సినిమాలే కాకుండా విరూపాక్ష మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు (karthik Dandu)దర్శకత్వంలో NC24 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela )నటిస్తున్నట్టు అఫీషియల్ టాక్ కూడా వినిపించింది. అలాగే నాగచైతన్యకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘మజిలీ’ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana) దర్శకత్వంలో కూడా చైతూ మరో సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపించింది. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈ ఏడాది ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా నాగచైతన్య హిట్ కొట్టిన ‘ధూత’ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా దూత-2 వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా కొత్త సంవత్సరం నాగచైతన్యకు బాగా కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది వచ్చే తండేల్ సినిమా హిట్ అయితే మాత్రం నాగచైతన్య మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మరి చూడాలి నాగచైతన్యకు 2025 ఏ విధంగా వెల్కమ్ చెబుతుందో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×