North Korea Kim Jong Un Picks 25 Virgins for his Pleasure Squad: నార్త్ కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ గురించి పెద్దగా ప్రపంచానికి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఏమి తెలిసినా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందుకే తన గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడతాడు. తేడా వస్తే ఇక అంతే.. అందుకే ఆయనను నియంత అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే బొద్దుగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో కిమ్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా కిమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. నార్త్ కొరియా నియంత కిమ్‌ను సంతోషపెట్టడానికి ప్రతీ ఏటా 25 మంది యువతుల టీమ్ పని చేస్తోంది. ఎనిమిదేసి మంది చొప్పున ఒక్కో టీమ్ ఉంటుంది. ఒక టీమ్ మసాజ్ చేయడానికి, మరొక టీమ్ పాటలు పాడడం, ఇంకో టీమ్ డ్యాన్స్ చేయడం కోసం పని చేస్తాయి. మూడో గ్రూపు మాత్రం లైంగిక కార్యకలాపాలకు వినియోగించుకుంటాడట కిమ్. ఆయనతో క్లోజ్‌గా ఉండడం.. ఎలా సంతోషంగా ఉంచాలన్నదే వారి డ్యూటీ.
Also Read: Pakistan Bus Accident : లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి
అంతేకాదు అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్ దగ్గరకు పంపిస్తారు. 20 ఏళ్లు వచ్చేవరకు ఆ టీమ్‌లో ఉంచుతారు. తర్వాత హ్యాపీ గాళ్స్‌ను బయటకు పంపించడం అనేది ఉండదు. కిమ్ బాడీగార్డ్స్‌తో వారికి మ్యారేజ్ చేస్తారు. ఈ క్రమంలో కిమ్ కంచుకోట నుంచి యువతులు బయటకు వచ్చే ఛాన్స్ లేదన్నమాట.
అందమైన అమ్మాయిలను ఎలా ఎంపిక చేస్తారనేది అసలు ప్రశ్న. అందమైన అమ్మాయిల కోసం కిమ్ కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ దేశవ్యాప్తంగా పర్యటిస్తుంది. అందమైన అమ్మాయిల గురించి వివరాలు సేకరిస్తుంది. వారి కుటుంబం, రాజకీయ నేపథ్యం ఇలా రకరకాల కోణాల్లో ఆరా తీయడం ఆ టీమ్ ముఖ్య ఉద్దేశం. నార్త్ కొరియా నుంచి పారిపోయినవాళ్లను పక్కన పెడతారు. దక్షిణకొరియాలోగానీ విదేశాల్లోగానీ బంధువులు ఉన్నవారిని అస్సలు ఎంపిక చేయరు. సెలక్ట్ చేసిన యువతులకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. అంతా అయిన తర్వాత వారిని రాజధాని ప్యాంగ్యాంగ్‌కు తరలిస్తారు.
Also Read: Bomb Blast in Balochistan : బలూచిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. జర్నలిస్ట్ సహా ముగ్గురు మృతి
రాజధానికి అమ్మాయిలు చేరుకోగానే ప్రత్యేక బస్సులో మూడో కంటికి కనిపించకుండా రాత్రి వేళ అధ్యక్ష భవనానికి సమీపంలో ఉన్న భవనానికి తీసుకెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే.. చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు అంగీకరించాకే వీరిని ఎంపిక చేసుకుంటారు. ఇటీవల నార్త్‌కొరియా నుంచి పారిపోయిన ఓ యువతి అంతర్జాతీయ మీడియాకు పైవిషయాలను వెల్లడించింది. దీంతో కిమ్ లోగుట్టు వెలుగులోకి వచ్చింది. ఆ తరహా వార్తలు నార్త్‌కొరియా నియంతల కాలం నుంచి జరుగుతున్నాయని మీడియాలో వార్తలు లేకపోలేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు లేకపోలేదు.