BigTV English

Viral Video: పాముకు CPR చేయడం ఏంటి బ్రో? నిజంగా నువ్ గ్రేట్ అబ్బా!

Viral Video: పాముకు CPR చేయడం ఏంటి బ్రో? నిజంగా నువ్ గ్రేట్ అబ్బా!

పామును చూస్తేనే భయమేస్తుంది. కొంత మందికి  పాము పేరు వింటేనే వణుకు పుడుతుంది. కానీ, ఓ యువకుడు పాముకు CPR చేసిన ప్రాణాలు కాపాడాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


పాము ప్రాణాలు కాపాడిన యువకుడు

గుజరాత్‌ లోని వడోదరకు చెందిన వన్యప్రాణి రక్షణ యష్ తద్వి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి పక్కనే ఓ పాము పడిపోయి ఉంది. ప్రాణాలతోనే ఉందని గమనించాడు. ఆ పాము విషపూరిత జంతువు కాదని తెలుసుకున్నాడు. దానికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని గుర్తించాడు. వెంటనే ఆ పామును చేతిలోకి తీసుకున్నాడు. ఓ చేతితో మెడ దగ్గర పట్టుకుని దాని నోరు తెరిచి గాలి ఊదాడు. మొదట రెండుసార్లు ఊదినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. అయినప్పటికీ మరో ప్రయత్నం చేశాడు. మూడోసారి అతడి శ్రమకు ఫలితం దక్కింది. పాము స్పృహలోకి వచ్చింది. ఆయన పాముకు CPR చేస్తుండగా స్థానిక యువకులు వీడియో తీశారు. ఆ వీడియోను ‘మై వడోదర’ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యష్ చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. అయితే, అన్ని పాముల విషయంలో ఇలా చేయడం ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఏ పాములకు విషం ఉంటుదో? ఉండదో? తెలిసిన వాళ్లే ఇలా చేయాలంటున్నారు.


కోతికి CPR చేసి బతికించిన హెడ్ కానిస్టేబుల్

యష్ పాముకు CPR చేసి బతికించినట్లే యూపీలోని బులంద్ షహర్ లో ఓ హెడ్ కానిస్టేబుల్ కోతికి CPR చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఏడాది మేలో వికాస్ తోమర్ అనే హెడ్ కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్తుండగా ఓ కోతి చెట్టు కొమ్మ మీది నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఎండ బాగా ఉండటంతో శ్వాస కూడా తీసుకోలేకపోయింది. వెంటనే ఆయన తన తోటి పోలీసుల సాయంతో కోతికి CPR చేశారు. కాసేపటి తర్వాత కోతి నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందరూ వికాస్ ను ప్రశంసించారు.

కుక్కను ప్రాణాలతో కాపాడిన అగ్నిమాపక  సిబ్బంది

గత నెలలో అమెరికాలో ఓ కుక్కకు అగ్నిమాపక సిబ్బంది CPR చేసి ప్రాణాలు కాపాడారు. ఉటాలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో ఓ కుక్క అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆ కుక్కకు CPR చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ కుక్క మళ్లీ యథావిధిగా పరిగెత్తింది. మొత్తంగా CPR ద్వారా పలువురు ఆయా జంతువుల ప్రాణాలను కాపాడటం పట్ల పలువురు జంతుప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలను షేర్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

Read Also: పాము కడుపులో 100 గ్రాముల ప్లాస్టిక్, ఒడియమ్మా బడువా.. దాన్నెలా తిన్నావే తల్లి?

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×