BigTV English

Viral News: పాము కడుపులో 100 గ్రాముల ప్లాస్టిక్, ఒడియమ్మా బడువా.. దాన్నెలా తిన్నావే తల్లి?

Viral News: పాము కడుపులో 100 గ్రాముల ప్లాస్టిక్,  ఒడియమ్మా బడువా.. దాన్నెలా తిన్నావే తల్లి?

ప్లాస్టిక్ భూతం కారణంగా ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది జీవులు ప్లాస్టిక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ముంబైలో ఓ పాము కడుపులో నుంచి  ఏకంగా 100 గ్రాముల ప్లాస్టిక్ బయటపడటం చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఆ తర్వాత పాము చనిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


పాము కడుపులో భారీగా ప్లాస్టిక్

ముంబైలోని జుహులో ఓ పాము ఎలుకను తినేందుకు ప్రయత్నించింది. వేటాడి పట్టుకుని మింగింది. గొంతులోకి వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లకపోవడంతో చాలా ఇబ్బంది పడింది. పాము నోరు ఉబ్బి, ద్రవం కారుతూ ఆయాసపడుతంది. ఈ విషయాన్ని గమనించిన రినా దేవ్ అనే డాక్టర్ ఎలుకను మింగలేక ఇబ్బంది పడుతున్నట్లు భావించింది. దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి ఎక్స్ రే తీసింది. ఆమెకు దాని కడుపులో ఏదో అనుమానిత వస్తువు కనిపించింది. నెమ్మదిగా దాని నోటిలోని ఎలుకను తొలగించారు. తర్వాత మూడు కప్పలను కూడా బయటకు తీశారు. ఆ తర్వాత దానికి కడుపులో ఉన్న అనుమానిత వస్తువు ఏంటా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.


రెండు ఫీట్ల పొడవైన ప్లాస్టిక్ కవర్ గుర్తింపు

పాము కడుపులో పెద్ద ప్లాస్టిక్ కవర్ ఉన్నట్లు డాక్టర్ రినా గుర్తించారు. ఆ ప్లాస్టిక్ కవర్ రెండు ఫీట్ల పొడవు, ఒక ఫీట్ వెడల్పు ఉంది. పాము నాలుగు అడుగు పొడవు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ కవర్ మొత్తం బయటకు తీసి చూస్తే సుమారు 100 గ్రామాలు బరువు ఉన్నట్లు వెల్లడించారు. అంత పెద్ద కవర్ ఎలా తిన్నదో అర్థం కావట్లేదని తెలిపారు. కవర్ తీసిన తర్వాత కాసేపు బాగానే ఉన్న పాము ఒక్క రోజు తర్వాత చపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత దానికి పోస్టుమార్టం చేశారు. పాము గ్యాస్ట్రిక్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలిపారు. అంతేకాదు, పాములోని అవయవాలు కుళ్లిపోతున్నట్లు కనుగొన్నారు. ప్లాస్టిక్ కారణంగా ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని డాక్టర్ రినా తెలిపారు. అందుకే ప్లాస్టిక్ ను పారవేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పర్యావరణహితమైన వస్తువులను వినియోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. అవసరం ఉంటేనే ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించాలన్నారు.

Read Also: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

ఐరన్ రింగ్స్ లో చిక్కుకున్న కొండ చిలువ   

రీసెంట్ గా ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో ఓ కొండ చిలువ ఐరన్ రింగ్స్ లో చిక్కుకుని తీవ్రంగా ఇబ్బంది పడింది. పొరపాటును ఐరన్ రింగ్స్ లోకి వెళ్లిన పాము, బయటకు రాలేక అవస్థలు పడింది. వెంటనే స్థానికులు ఆ పామును గమనించి ఓ ఎలక్ట్రీషియన్ ను రప్పించి నెమ్మదిగా ఐరన్ రింగ్స్ ను కట్ చేయించారు. పాము చిన్నపాటి గాయాలతో బయటపడింది. ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగలేదనని స్థానికులు తెలిపారు.

Read Also: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×