BigTV English

Dangerous Stunt for Insta Reels: అరేయ్.. ఎవర్రా మీరంతా? రీల్ వ్యూస్ కోసం ఎంతకు తెగించార్రా.. పడితే మెడికల్ టెస్ట్ లకు కూడా పనికిరారు!

Dangerous Stunt for Insta Reels: అరేయ్.. ఎవర్రా మీరంతా? రీల్ వ్యూస్ కోసం ఎంతకు తెగించార్రా.. పడితే మెడికల్ టెస్ట్ లకు కూడా పనికిరారు!
Dangerous Stunt Hanging From Moving Car Door for Insta Reels: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నడి రోడ్లపై నానా హంగామా చేస్తుంటారు. తాజాగా కొందరు వ్యక్తులు ప్రమాదకర స్టంట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఓ వ్యక్తి శరీరం చుట్టూ ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని కదులుతున్న కారు డోర్‌కి పట్టుకుని వేలాడుతూ కనిపించాడు.

 


పైగా ఆ ప్లాస్టిక్ కవర్ తెగిపోతుందేమోనని భయం కూడా లేకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ అతను స్టంట్‌ను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదకర స్టంట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: పాపం.. దుబాయ్‌లో బిజినెస్ మేన్‌కు కూడా కష్టాలు తప్పట్లేదు


కారులోని వ్యక్తులు కూడా ఎంజాయ్ చేస్తూ.. అందరికి హాయ్ చెబుతూ కనిపించారు. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు దాదాపు 90 మిలియన్ల వ్యూస్, రెండు మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×