BigTV English

Chiranjeevi’s Vishwambhara Updates: చిరు కెరీర్‌‌లో ఇదే తొలిసారి.. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని రోజులు కేటాయించాడా..?

Chiranjeevi’s Vishwambhara Updates: చిరు కెరీర్‌‌లో ఇదే తొలిసారి.. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని రోజులు కేటాయించాడా..?

Chiranjeevi Allotted 26 Days for Vishwambhara Fight Sequel: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ‘విశ్వంభర’ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకొచ్చింది. విశ్వంభర భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ కోసం మేకర్స్ 26 రోజుల పాటు అత్యద్భుతంగా చిత్రీకరణ జరుపుకున్నారు.


ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

ప్రస్తుతం, టీమ్ టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ ఆధ్వార్యంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన భారీ సెట్‌లో ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కలయికలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి, ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్‌లో గూస్ బంప్స్ రానున్నట్లు తెలుస్తోంది.


Also Read: బురద నీళ్లలో చిరంజీవి.. ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో షూటింగ్ జరుపుకుంది. చిరు ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే అత్యధికం. కాగా ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఈ యాక్షన్ బ్లాక్‌ను చూసి అభిమానులు, ప్రేక్షకులు థియేటర్‌లలో సందడి చేస్తారని మూవీ టీం అభిప్రాయపడుతుంది.

కాగా విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఇకపోతే ఈ మూవీని దర్శకుడు వశిష్ట ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ ఒక్క గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

Also Read: Good Bad Ugly: కూతురు వయసున్న హీరోయిన్ తో అజిత్ రొమాన్స్.. ?

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. కుర్రహీరోలతో సమానంగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడు. తమ అభిమానులను అలరించేందుకు మెగాస్టార్ ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవడంలో ముందుంటాడు. ఇటీవలే ఈ మూవీలో ఓ సీక్వెన్స్ కోసం ఏకంగా బురదలోకి దిగాడు. ఎలాంటి డూప్ లేకుండా ఆయన చేసిన ఈ స్టంట్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని విశ్వంభర మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×