Girl Catching Snake : పాము.. ఆ పేరు వినగానే కొందరికి ఒళ్లు జల్దిరిస్తుంది. అవి కంటపడితే సహజంగానే పారిపోతాము. కానీ ఒక అమ్మాయి. పాము పట్ల విచిత్ర వైఖరిని ప్రదర్శించింది. ఎలాంటి రక్షణ లేకుండానే ఓ గోడౌన్‌లోని పామును ఒంటిచేతితో పట్టుకుంది. ఆ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
వీడియో చూస్తే.. ఆ అమ్మాయిని భయం లేకుండా ఎంతో ధైర్యంతో పామును చేతిలో పట్టుకొని గోడౌం నుంచి బయటకు తెస్తుంది. పాము కింద నుంచి పైకి ఊగిసలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా.. అమ్మాయి మాత్రం పామును గట్టిగా పట్టుకొని ఉంది. అమ్మాయి చుట్టు పక్కన ఉన్న వారేమో ఓ పక్క భయంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు.
Read More: ఇదెక్కడి పిచ్చి రా బాబు..!
ఇక వీడియో చివర్లో చూస్తే ఆ అమ్మయి ప్లాస్టిక్‌తో చేసిన రౌండ్ కంటైనర్‌లోకి పామును వదులుతుంది. పాము కూడా హమ్మయ్యా మా ఇంటికి వచ్చేశాను అన్నట్లుగా కంటైనర్ లోపలికి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను చుట్టూ ఉన్న జనాలు వారి ఫోన్లలో షూట్ చేస్తున్నారు. కొంచెం అటూఇటూ అయ్యింటే పక్కాగా పరుగులు పెట్టేవారు.
ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉంది. వైరల్ వీడియోస్ అనే ఎక్స్ ఖాతా నుంచి ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది. దాని వివరాలను మాత్రం పేర్కోలేదు. ‘ ఏమి ధైర్యం పాప.. నీ ధైర్యానికి ఫిదా అయిపోయా..!’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.
Read More: పాములతో వైన్ తయారీ.. మామూలు కిక్కు కాదు.. మాహా కిక్కు
ఈ అమ్మాయి ధైర్యం చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. అమ్మాయిలు అంటే ఇలా ఉండాలని అంటున్నారు. నీ డేర్ కి నా సలామ్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నేటి కాలంలో చాలా మంది పాము కంటబడినే వెంటనే అవి కాటేస్తాయని చంపేస్తున్నారు. పాములు పొరపాటున జనావాసాల్లోకి వస్తుంటాయి. కాబట్టి వాటి ప్రాణాలు తీయడం సరైనది కాదు.