BigTV English

Viral Video : ఇదెక్కడి పిచ్చి రా బాబు..!

Viral Video : ఇదెక్కడి పిచ్చి రా బాబు..!

Stunts Viral Video : నేటి కాలంలో అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ఎవరి ఫోన్ చూసిన సోషల్ మీడియా నడుస్తూనే ఉంటుంది. టైమ్ దొరికిందంటే చాలు సోషల్ మీడియా ఓపెన్ చేసి వీడియోస్ చూడాల్సిందే. ఎంతగా అడిక్ట్ అయ్యారంటే.. సోషల్ మీడియాలో ఎదైనా కంటెంట్ అప్లోడ్ అయిందని ఫోన్ మోగిదంటే పని మానుకోని అది చూస్తూ ఉండిపోతారు. చాలా మంది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి చిత్ర విచిత్రమైన వీడియోలు చేస్తుంటారు. ఓవర్ నైట్‌లో స్టార్ అవ్వడానికి, లైక్స్, షేర్స్ వచ్చేందుకు యువత నానా రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు.


ఇలా కొందరు తనకున్న టాలెంట్ బయటపెడుతుంటే.. మరి కొందరెమో డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, టిప్స్‌‌తో అనేక రకాల వీడియోలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ చేయడం వల్ల వచ్చే లైక్స్, షేర్స్, కామెంట్లతో ఆనంద పడుతుంటారు.

Read More : అయ్యోపాపం ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్..!


మన యూత్ అయితే సోషల్ మీడియాలో ఫెమస్ కావడానికి, ఫాలోవర్స్‌ని పెంచుకోవడానకి, లైక్స్, షేర్స్ కోసం అనేక స్టంట్లు కొడుతున్నారు. వారికి ఆ స్టంట్లు రాకున్నా , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకుండానే డేంజరెస్ ఫీట్స్ కొడుతున్నారు. బైక్‌లపై స్టంట్స్ చేయడం, మంటల్లో దూకడం, జంతువులతో చెలగాటం ఆడటం వంటివి చేస్తున్నారు.

ఇదే సమయంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

సజ్జనార్ షేర్ చేసిన వీడియోలో ఏడుగురు యువకులు మూడు బైకులను రోడ్డుపై వరుసగా పెట్టారు. తర్వాత ఆరుగురు యువకులు ఎంక్రేజ్ చేస్తుండగా.. ఒక యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై పెట్టిన మూడు బైకులపై నుంచి దూకి రోడ్డుపై పడిపోయాడు. ఈ స్టంట్‌లో ఆ యువకుడి ముఖం పూర్తిగా రోడ్డుకు తాగింది. ముఖానికి ఏమైందో మాత్రం కనపడలేదు. ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాడు.

కేవలం యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఇటువంటి వీడియోలు చేస్తున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవగాహన లేకుండా బైక్‌లపై నుంచి దూకడం ఎంత ప్రమాదకరమో గుర్తించాలని తెలిపారు. ప్రాణం పోయినా, గాయాలైన పర్వాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. సోషల్ మీడియా మత్తులో పడి యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవడం బాధకరమని సజ్జనార్ దీనికి క్యాప్షన్ ఇచ్చారు.

Read More : పాములతో వైన్ తయారీ..!

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. పోతార్రా బాబు.. ఎందుకు ఈ ఫీట్లు అని కొందరు.. బాబు పళ్లు రాలాయా లేదా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×