BigTV English

Watch: జైలు నుంచి నేరుగా బాధితుడి ఇంటికి.. బాంబులు పేల్చి, దావత్ ఇచ్చి హంతకుడి హంగామా!

Watch: జైలు నుంచి నేరుగా బాధితుడి ఇంటికి.. బాంబులు పేల్చి, దావత్ ఇచ్చి హంతకుడి హంగామా!

చాలా మంది క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకు వెళ్తుంటారు. నాలుగు గోడల నడుమ నరకం అనుభవిస్తారు. ఆ క్షణం కాస్త ఓపిక పడితే బాగుండేది అనుకుంటారు. చాలా బాధపడతారు. అలాంటి వాళ్లు బయటకు వచ్చాక.. సైలెంట్ గా ఇంటికి వెళ్తారు. కుటుంబ సభ్యులను కలిసి.. మిగతా జీవితాన్ని ఎలాంటి గొడవలు లేకుండా గడిపేందుకు ప్రయత్నిస్తారు. మరికొంత మంది దీనికి భిన్నంగా ఉంటారు. జైలుకు వెళ్లి ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలవుతారు. జైల్లో ఉన్న ఇతర నేరస్తులతో కలిసి కేడీ పనులు చేసేందు ప్లాన్ చేస్తారు. బయటకు వచ్చాక.. చిల్లర పనులు చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ రకం వాడే.


జైలు నుంచి నేరుగా బాధితుడి ఇంటికెళ్లిన హంతకుడు

చైనాకు చెందిన జియాంగ్ అనే వ్యక్తికి హత్యకేసులో 20 ఏండ్లు జైలు శిక్ష పడింది. తాజాగా జైలు శిక్ష పూర్తి అయ్యాయి. తాజాగా జైలు నుంచి విడుదలై నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లాడు. బాధితుడి ఇంటి ముందు బాంబులు పేల్చి హంగామా చేశాడు. అంతేకాదు, తన అనుచరులకు అక్కడే పార్టీ ఏర్పాటు చేశాడు. బాధిత కుటుంబం అతడిని న్యూసెన్స్ ఆపాలని కోరినా మాట వినకుండా అలాగే కొనసాగించాడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు హంతకుడిని హెచ్చరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు జియాంగ్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. 20 ఏండ్లు జైలు శిక్ష పడ్డా సిగ్గు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కిల్లర్ తో మాట్లాడాలనుకుంటున్నా- బాధిత కుటుంబ సభ్యుడు

అటు తన తండ్రిని హత్య చేసిన జియాంగ్ తో మాట్లాడాలి అనుకుంటున్నట్లు బాధితుడి కొడుకు చెప్పాడు. “అవకాశం ఉంటే నేను మానాన్న హత్య చేసిన హంతకుడితో మాట్లాడాలి అనుకుంటున్నాను. నా కోపాన్ని చూపించడానికి కాదు. మా కుటుంబంతో పాటు అతడి కుటుంబానికి ఇంత బాధ కలిగించే పని ఎందుకు చేశాడో అడగాలి అనుకుంటున్నాను. కానీ, అతడు జైలు నుంచి విడుదలయ్యాక, నేరుగా మా ఇంటికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు” అని చెప్పుకొచ్చాడు.

 15 ఏండ్ల వయసులోనే హత్య చేసిన జియాంగ్

జియాంగ్ 15 ఏండ్ల వయసులోనే 39 ఏండ్ల పొరుగు వ్యక్తిని హత్య చేయించాడు. ముగ్గురు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఈ హత్య చేయించాడు. ఇంట్లో నిద్రిస్తుండగా అతడిని చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీకి నిప్పటించారు. ఆ తర్వాత హంతకుడి నుంచి బాధిత కుటుంబానికి బెదిరింపులు కూడా వచ్చాయి. బంధువులతో గొడవల కారణంగానే ఈ హత్య చేశారు. తాజాగా జైలు నుంచి విడుదలైన జియాంగ్ బాధితుల ఇంటికి వచ్చిన హంగామా చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రావడంతో హంతకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధిత కుటుంబానికి పోలీసులు భరోసా ఇచ్చారు.

Read Also: అయ్య బాబోయ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇలా ఉంటుందా? నెట్టింట్లో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×