BigTV English

Viral Video: అయ్య బాబోయ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇలా ఉంటుందా? నెట్టింట్లో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

Viral Video: అయ్య బాబోయ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇలా ఉంటుందా? నెట్టింట్లో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

I Phone 18 Pro Max Funny Video: సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవాలంటే క్రేజీగా ఆలోచించాలి. లైకుల వర్షం కురవాలంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. కామెంట్ల వరద పారాలంటే ఫన్నీగా ఆకట్టుకోవాలి. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. గ్రాఫిక్స్ సాయంతో మతిపోగొట్టే వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఆ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. లైకులు, కామెంట్ల రావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు చూద్దాం..


ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫన్నీ వీడియో

చైనాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ క్రియేట్ చేసిన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వీడియోను SGV   Singapore’s Virality (Official) అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.  యాపిల్ 18 ప్రో మ్యాక్స్ ఎలా ఉంటుందో అని ఇందులో ఫన్నీగా చూపించాడు. ఈ ఫోన్ ఇంచుమించు ఓ గజం పొడవుంది. ఇందులో నాలుగు బోలెడు యాప్స్ ఉన్నాయి. ఈ ఐఫోన్ ద్వారా చాలా దూరం ఉన్న వాటిని కూడా జూమ్ చేసి క్లియర్ గా చూడొచ్చంటూ ఓ అపార్ట్ మెంట్ లో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని చూపించి నవ్వించారు. ఈ ఫోన్ తో గేమ్స్ ఆడేందుకు మరే ఇతర ఫోన్ పనిరాదని చెప్పాడు. ఇక ఈ ఫోన్ ఎవరైనా తన మీద దాడి చేసి డబ్బులు దోచుకెళ్లేందుకు ప్రయత్నిస్తే, జేబులో ఉన్న ఫోన్ బయటకు తీయగానే గన్ అనుకుని భయపడి బెదిరిపోతారంటూ ఫన్ చేశాడు. అంతేకాదు, స్నూకర్ ఆడ్డానికి స్టిక్ అవసరం లేదు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ తో ఆడవచ్చుంటూ బాల్స్ ను హోల్ లోకి వేస్తే అలరించాడు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by SGV 🇸🇬 Singapore’s Virality (Official) (@sgvirality)

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లక్షల కొద్ది వ్యూస్ దక్కించుకుంటున్నది. అటు నెటిజన్లు సైతం ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇలా ఉంటే, ఐఫోన్ నెక్ట్స్ వెర్షన్లు ఎలా ఉంటాయో? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐఫోన్ ఓకే, సామ్ సంగ్ పరిస్థితి ఏంటి? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.  క్రియేటివ్ వీడియోకు మరింత క్రియేటివిటీతో కూడిన కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ స్టాతో పాటు ఎక్స్ లోనూ ఈ వీడియో బాగా వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి గత కొంత కాలంగా ఇలాంటి ఫన్నీ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా పాకిస్తాన్ కు చెందిన కొందరు యువకులు తాళ్లు కట్టి పట్టాలను పక్కకు లాగుతున్నట్లు ఓ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఆ వీడియో కొద్ది గంటల్లోనే బాగా ట్రెండ్ అయ్యింది. అంతకు ముందు కొండ మీద ఉన్న ఓ ఏనుగును పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కిందికి దించారనే వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే, ఇవన్నీ కేవలం గ్రాఫిక్స్ ద్వారా ఫన్నీ కోసం క్రియేట్ చేసిన వీడియోలు కావడం విశేషం.

Read Also: తాళ్లు పెట్టి పట్టాలు లాగేసిన యువకులు, నెట్టింట వీడియో వైరల్

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×