E-Paper
Advertisement

Flight Seats: విమానంలోని సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? రీజన్ ఇదే

Flight Seats: విమానంలోని సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? రీజన్ ఇదే
Advertisement

ఇప్పుడు విమాన ప్రయాణం సాధారణమైపోయింది. రోజూ లక్షలాది మంది వివిధ దేశాలకు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. విమాన ప్రయాణికులు నీలం రంగులోనే సీట్లు ఉండడం గమనించే ఉంటారు. విమాన తయారీ సంస్థలు, ఎయిర్‌లైన్స్ కలిసి తీసుకున్న ఒక తెలివైన డిజైన్ నిర్ణయం ఇది. దీనికి వెనుక సైన్స్, సైకాలజీ, నిర్వహణ వంటి అనేక కారణాలు ఉన్నాయి. విమానాల లోపలి డిజైన్ తయారీలో ప్రముఖ సంస్థలు అయిన బోయింగ్, ఎయిర్‌బస్ వంటి కంపెనీలు ప్రయాణికుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రయాణికులు సౌకర్యంగా ఉండటం, భయం తగ్గటం, అలాగే సీట్లు ఎక్కువకాలం ఉపయోగించగలగటం వంటి అంశాలన్నీ రంగు ఎంపికలో కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నీలం రంగు ఉత్తమ ఎంపికగా నిలిచింది.

సైకాలజీ ప్రకారం
మొదటగా సైకాలజీ కోణంలో చూస్తే నీలం రంగు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. రంగులపై చేసిన అధ్యయనాలు చెబుతున్నట్లు, నీలం రంగు చూసినప్పుడు మనసులో భద్రత, నమ్మకం, స్థిరత్వం వంటి భావనలు కలుగుతాయి. విమాన ప్రయాణం కొందరికి భయంగా అనిపించవచ్చు. టేకాఫ్, ల్యాండింగ్, టర్బులెన్స్ వంటి పరిస్థితుల్లో ఆందోళన పెరుగుతుంది. అలాంటి సమయంలో క్యాబిన్‌లో కనిపించే నీలం సీట్లు ప్రయాణికులను కొంతవరకు రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఇంకో ముఖ్య కారణం శారీరక స్పందన. నీలం రంగు చూసినప్పుడు మన శరీర స్పందన కొద్దిగా నెమ్మదిస్తుంది అని పరిశోధనలు సూచిస్తున్నాయి. హృదయ స్పందన, ఒత్తిడి స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల విమాన ప్రయాణం మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో కూడా నీలం రంగు ఎక్కువగా ఉపయోగిస్తారు.

Advertisement

మరకలు కనిపించవు
విమానాల్లో నీలం రంగు సీట్లు ఉండటానికి ప్రాక్టికల్ కారణం కూడా ఉంది. ప్రతి రోజు వందలాది మంది ఒకే సీట్లపై కూర్చుంటారు. ప్రయాణంలో ఆహారం, పానీయాలు పడటం, షూ మార్కులు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. లైట్ కలర్ సీట్లపై ఇవి వెంటనే కనిపిస్తాయి. కానీ డార్క్ నీలం రంగులో మురికి, మరకలు తక్కువగా కనిపిస్తాయి. దీంతో సీట్లు ఎక్కువకాలం శుభ్రంగా కనిపిస్తాయి. దీని వల్ల ఎయిర్‌లైన్స్‌కు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. సీట్లు తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు. శుభ్రపరచడం కూడా సులభంగా ఉంటుంది.

Also read: worst Country: ఈ దేశంలో టీవీ చూసే స్వేచ్ఛ కూడా లేదు, టీవీ రిమోట్ ప్రభుత్వ నిఘాలోనే

Advertisement

నీలం రంగు మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా మంది ఇష్టపడే సాధారణ రంగు. కొందరికి ఎరుపు బాగా నచ్చుతుంటే, మరికొందరికి పసుపు నచ్చుతుంది. కానీ నీలం రంగు మాత్రం దాదాపు అందరికీ నచ్చుతుంది. ఇది అతి ప్రకాశవంతంగా ఉండదు.. అలా అని నిర్జీవంగా కూడా ఉండదు. అందుకే డిజైనర్లు దీనిని సేఫ్ కలర్ గా భావిస్తారు. విమాన ప్రయాణంలో ఆకాశం ఒక ముఖ్యమైన భాగం. విమానం కిటికీ బయట కనిపించే ఆకాశం నీలం రంగులో ఉంటుంది. క్యాబిన్‌లోని నీలం సీట్లు ఆ అనుభూతిని మరింత సహజంగా చేస్తాయి. ప్రయాణికులకు విమాన ప్రయాణ అనుభవం సంపూర్ణంగా అనిపిస్తుంది.

ఇప్పుడిప్పుడే కొత్త రంగులు
ఇటీవల కొన్ని ఎయిర్‌లైన్స్ కొత్త రంగులతో ప్రయోగాలు చేస్తున్నప్పటికీ, నీలం రంగు ఆధిపత్యం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాల్లో ప్రయాణికుల సౌకర్యం అత్యంత ప్రాధాన్యం కావడంతో నీలం రంగు ఎంపిక కొనసాగుతోంది. విమానాల్లో నీలం రంగు సీట్లు ఉండటం ఒక చిన్న విషయం లాగా కనిపించినా, దాని వెనుక పెద్ద ఆలోచన ఉంది. ప్రయాణికుల మానసిక సౌకర్యం, శుభ్రత నిర్వహణ, ఖర్చు నియంత్రణ, అందం … ఈ నాలుగు అంశాల గురించి ఆలోచించి నీలం రంగును ఎంపిక చేశారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×