E-Paper
Advertisement

Hindu Traditions: చనిపోయిన వారి వస్తువులను వాడితే ఏమౌతుంది? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Hindu Traditions: చనిపోయిన వారి వస్తువులను వాడితే ఏమౌతుంది? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Hindu Traditions: హిందూ సంప్రదాయంలో పునర్జన్మపై గట్టి విశ్వాసం ఉంటుంది. శరీరం నశించినా.. ఆత్మ ప్రయాణం అక్కడితో ఆగిపోదని నమ్మకం. చనిపోయిన వారి ఆత్మ మరో జన్మకు సిద్ధం అవుతుందో లేదా కొంతకాలం ఇతర లోకాల్లో సంచరిస్తుందో అనే భావన మన సంస్కృతిలో బలంగా ఉంది. అందుకే చనిపోయిన తర్వాత చేసే క్రతువులు, పాటించే నియమాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే మన చుట్టూ ఆత్మలు, అదృశ్య శక్తులు ఉంటాయనే నమ్మకం కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘చనిపోయిన వారి వస్తువులు వాడకూడదు’ అని తరచూ మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఇలా చెప్పడం వెనకున్న అసలైన కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

భావోద్వేగాలే అసలు కారణం:

మనకు అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వారు వాడిన వస్తువులు, ధరించిన దుస్తులు మన కంట పడితే.. వారి జ్ఞాపకాలు మరింత బలంగా గుర్తొస్తాయి. ఆ జ్ఞాపకాలు కొన్నిసార్లు ఓదార్పును ఇచ్చినా.. అంతకంటే ఎక్కువసార్లు మనసును మరింత భారంగా చేస్తాయి.

పదే పదే గుర్తుకు రావడం:

మరణించిన వారి దుస్తులు లేదా వ్యక్తిగత వస్తువులను వాడటం వల్ల ఆ బాధ మళ్లీ మళ్లీ మనల్ని వెంటాడుతుంది. అది క్రమంగా ఆందోళన, మానసిక క్షోభకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే హిందూ సంప్రదాయం.. చనిపోయిన వారి వస్తువులను వాడకూడదు అనే నియమాన్ని సూచిస్తుంది.

ఆత్మ ప్రయాణం ముందుకు సాగేలా:

మరణించిన వ్యక్తిని మనం పదేపదే తలుచుకుంటూ బాధపడితే.. వారి ఆత్మను మనం ఈ లోకంలోనే బంధించినట్లు అవుతుంది. అలాగే వారి వస్తువులను తరచూ వాడుకుంటూ ఉంటే.. చనిపోయిన వారి ఆత్మ ముందుకు సాగడం కష్టమవుతుందనే నమ్మకం ఉంది. ఆత్మ తన ప్రయాణాన్ని పూర్తిచేసి, శాంతిగా తదుపరి దశకు చేరాలంటే, మనం కూడా ఆ విడిపోవడాన్ని అంగీకరించాలి అనే భావన హిందూ సంప్రదాయం వెనుక ఉంది.

జ్యోతిష్యం చెప్పేది ఏమిటి?

మరణించిన వారి దుస్తులు లేదా వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం మంచిదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మకు శాంతి లభిస్తుందని, అలాగే వారి కుటుంబానికి కూడా సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్మకం. దానం చేయడం ద్వారా ఒకవైపు మనసుకు తేలికపాటు కలుగుతుంది. మరోవైపు ఆ వ్యక్తి జ్ఞాపకాన్ని మంచి కార్యంతో కలిపినట్లవుతుంది.

సంప్రదాయాల వెనకున్న నిగూఢ అర్థం:

ఇక్కడ చెప్పే నియమాలన్నీ భయానికి సంబంధించినవి కాదు. ఇవన్నీ మన మనసు ఆరోగ్యంగా ఉండేందుకు, దుఃఖాన్ని క్రమంగా అంగీకరించి ముందుకు సాగేందుకు రూపొందిన మార్గదర్శకాలుగా చూడాలి. ఎంత ఖరీదైనవి అయినా, ఎంత విలువైన జ్ఞాపకాలైనా కొన్నిసార్లు వాటిని వదిలేయడం మనకే మంచిది. అలా వదిలినప్పుడే మనసుకి శాంతి లభిస్తుంది. ఆత్మ కూడా తన ప్రయాణాన్ని నిర్భంధం లేకుండా కొనసాగిస్తుందనే నమ్మకం మన సంప్రదాయం చెబుతోంది.

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×