E-Paper
Advertisement

Bigg Boss 9 Kalyan Padala: ర్యాలీగా సొంతూరికి బిగ్ బాస్ విన్నర్.. ఫ్యాన్స్ ని చూసి షాకైన కళ్యాణ్!

Bigg Boss 9 Kalyan Padala: ర్యాలీగా సొంతూరికి బిగ్ బాస్ విన్నర్.. ఫ్యాన్స్ ని చూసి షాకైన కళ్యాణ్!
Advertisement

Kalyan Padala: బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించాడు కళ్యాణ్‌ పడాల. ఓ కామనర్‌ బిగ్‌బాస్‌ ట్రోఫీ ఎత్తడం సంచలనంగా మారింది. దీంతో కళ్యాణ్ పడాల హాట్‌ టాపిక్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌లో కామనర్‌ చరిత్ర సృష్టించాడంటూ అతడిని కొనియాడుతున్నాడు. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం కళ్యాణ్‌ మొదటిసారి తన స్వగ్రామంలో అడుగుపెట్టాడు. అక్కడ అతడికి గ్రామస్తులు ఘనవస్వాగం పలికారు.

ఫ్యాన్స్ ని చూసి షాకైన కళ్యాణ్..

Advertisement

విజయనగరంలోని భోగాపురం మండటలం సుందరపేట కళ్యాణ్‌ స్వగ్రామం అనే విషయం తెలిసిందే. నగరం నుంచి గ్రామం వరకు ర్యాలీగా వెళ్లిన కళ్యాణ్‌కి గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కారు సన్‌రూఫ్‌లో నిలుచుని టైటిల్‌ను అభిమానులకు చూపిస్తూ అభివాదం చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బిగ్‌ బాస్‌ కప్‌ గెలిచిన కళ్యాణ్‌ కోసం గ్రామస్థులు విజయోత్సవ సభ నిర్వహించి అతడిని సన్మానించారు. అనంతరం కళ్యాణ్‌ తన ఇంటికి వెళ్లి దేవుడికి నమస్కారం చేశాడు. గ్రామస్తులంత తన గెలుపు సెలబ్రేట్ చేసుకోవడం.. అతడి కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను చూసి కళ్యాణ్ షాక్ అయ్యాడు. 

జవాన్ నుంచి బిగ్ బాస్ వరకు..

Advertisement

సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ‘బిగ్‌బాస్‌ సీజన్‌9’ కి ఈసారి కామనర్స్‌కి అవకాశం కల్పించారు. దీంతో తన లక్‌ పరీక్షించుకునేందుకు అగ్నీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. అగ్రీ పరీక్షలో సత్తా చాటి బిగ్‌ బాస్‌ షోకు ఎంపికయ్యాడు. అలా సమాన్యుడిగా హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్‌ కూడా కల్యాణే కావడం గమనార్హం. తొలినాళ్లలో కల్యాణ్‌ ఆటతీరు ఏమంత ఆసక్తికరంగా సాగలేదు. ఎక్కువ మంది కంటెస్టెంట్‌లు ఉండటంతో అతడికి స్క్రీన్‌ స్పేస్‌కూడా తక్కువే వచ్చింది. ప్రియ ఎలిమినేట్ తర్వాత నుంచి కల్యాణ్‌ ఆట తీరు మారింది. చివరి వరకూ తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాడు. తనూజ, ఇమ్మాన్యుయేల్‌, డిమోన్‌ పవన్‌ల నుంచి కల్యాణ్‌కు గట్టి పోటీ ఎదురైంది. తనదైన ఆట తీరుతో హౌస్‌కు చివరి కెప్టెన్‌గా, మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌-9 విజేతగా నిలిచి ప్రైజ్‌ మనీతో పాటు, ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.

Also Read: Actress Poorna: మరోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలు వైరల్

ఫ్యాన్స్ కి థ్యాంక్స్‌

విజేతగా రూ. 35 లక్షలు గెలిచిన పవన్‌.. షో స్పాన్సర్స్‌లో ఒకరైన ‘రాఫ్‌ గ్రిప్పింగ్‌’ విజేతకు మరో రూ.5లక్షల క్యాష్‌ ప్రైజ్‌ను అందించారు. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్‌ కారును కూడా కల్యాణ్‌ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ.. “నన్ను ప్రేమించిన వారికి, నన్ను నమ్మి ఓటు వేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ సీజన్‌లో ప్రియ, శ్రీజ, తనూజలు నన్నెంతో సపోర్ట్‌ చేశారు. వారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఒకానొక సమయంలో కల్యాణ్‌కు ధైర్యమిచ్చి ముందుకు పంపిన వ్యక్తి తనూజ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నా తల్లిదండ్రులు వారి స్థాయికి మించి నన్ను పోషించారు. వాళ్లు లేకపోతే నేను లేను. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌తోనే నా ప్రయాణం ఇక్కడి వరకూ సాగింది. అందరికీ థ్యాంక్స్‌’’ అంటూ తన గెలుపు అనందాన్ని పంచుకున్నాడు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×