E-Paper
Advertisement

Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య
Advertisement

Viral Video: మూఢ విశ్వాసాల ముసుగులో కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ముఖ్యంగా భక్తి అనే పేరుతో కొందరు చేస్తున్న పనులు.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు.

వైరల్ వీడియోలో ఏముందంటే?

నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ మహిళ తన భర్తను భుజాల వరకూ భూమిలో కప్పిపెట్టింది. తల ఒక్కటి బయటకు కనిపించేలా చేసి.. భర్త తలపైౌ, చుట్టుపక్కల పూలు చల్లింది. అంతటి ఆగకుండా నెత్తిన పాలు పోస్తూ.. ‘హర హర మహాదేవ్’ అంటూ శివుడ్ని తలుచుకుంది. భర్త తలను శివలింగంలా భావించి.. సదరు మహిళ ఈ విచిత్రమైన కార్యక్రమానికి తెరలేపినట్లు తెలుస్తోంది.

Advertisement

భార్యను ప్రోత్సహించిన భర్త

భార్య విపరీత పోకడకు ఆమె భర్త కూడా సహకరించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భార్య తన తలపై అభిషేకం చేస్తుండగా భర్త దానిని అస్వాదిస్తూ కనిపించాడు. ఏమాత్రం ఆమెకు అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది క్షణాల్లో వైరల్ మారింది. దీనిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Advertisement

Also Read: International Fleet Review – 2026: విశాఖలో విశ్వ నౌకల వేడుక.. పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు.. 71 యుద్ధ నౌకలతో..

నెటిజన్ల భిన్నభిప్రాయాలు.. 

భర్తకు భార్య అభిషేకం చేయడాన్ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భక్తి ఏమో గానీ.. ఈ వీడియో చూస్తే తనకు విపరీతంగా నవ్వు వచ్చిందని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఇది మూర్ఖత్వం అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు. అయితే మరికొందరు మహిళ చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఈ దేశంలో ప్రతీ జాతి, మతానికి స్వంత ఆచారాలు ఉంటాయని పేర్కొంటున్నారు. కాబట్టి తోటి వారి ఆచారాలను గౌరవించడం నేర్చుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తం మీద సదరు వీడియో సోషల్ మీడియాలో ఒక పెద్ద బజ్ ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

Also Read: Fridges Under Rs 30,000: తక్కువ బడ్జెట్‌లో.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే.. మెరుగైన కూలింగ్, అత్యాధునిక ఫీచర్లు!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×