Viral Video: హైదరాబాద్ నుంచి బయలుదేరిన రైళ్లు సిటీ దాటగానే హిజ్రాలు ఎంటరవుతారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రయాణికులు ఇచ్చింది తీసుకున్నవారు కొందరైతే, డిమాండ్ చేసినవారు కొందరున్నారు. హిజ్రాకు డబ్బులు ఇచ్చిన ఓ యువకుడు, ఆ తర్వాత లిప్‌లాక్ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
హిజ్రాకు ఓ యువకుడి లిప్‌లాక్
కారణాలు ఏమైనా కావచ్చు.. సులువుగా డబ్బులు సంపాదించడం కోసం కొందరు హిజ్రాలుగా అవతారం ఎత్తుతారు.. లేకుంటే ఆ విధంగా మారిపోతుంటారు. రైళ్లు సిటీ దాటగానే ట్రాన్స్‌జెండర్లు ఎంటరవుతారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. మినిమమ్ పది రూపాయలు ఇవ్వాలని కోరుతారు. తక్కువ ఇస్తే తీసుకోరు. మరికొందరైతే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తారు.
డబ్బులు ఇచ్చేవరకు అక్కడి నుంచి కదలరు. చాలామంది మగవాళ్లని మాత్రమే అడుగుతారు. మహిళల జోలికి రారు. డబ్బులిస్తే వారి ఆశీర్వాదం ఇస్తారు. హిజ్రాలు ఆశీర్వాదం ఇస్తే మంచి జరుగుతుందని ఇప్పటికీ చాలామంది భావిస్తుంటారు. ఈ వీక్‌నెస్‌ని వారు సొమ్ము చేసుకుంటారు. అంతేకాదు ఇళ్లలో గృహప్రవేశం, పిల్లల పుట్టిరోజులకు వారి ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన సందర్భాలు సిటీలు, పట్టణాల్లో చాలానే ఉన్నాయి.
రైలులో ప్రయాణికులు షాక్
ఎక్కడ.. సమయం అనేది కాసేపు పక్కనబెడదాం. రైలులో జనరల్ కంపార్టుమెంటులో హిజ్రాలు ఎక్కారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది వారికి ఇచ్చారు. కానీ పైసీటులో కూర్చొన్న ఓ యువకుడి వద్దకు హిజ్రా వెళ్లింది. వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది అనేది తర్వాత విషయం. తన జేజులో నుంచి ఓ నోటు తీసి హిజ్రాకు ఇచ్చారు.
ALSO READ: నీరు ఎక్కువైతే వాడిపోతుంది.. తక్కువైతే పూస్తోంది ఆ చెట్టు
ఒప్పదం ప్రకారం.. ఆ యువకుడికి హిజ్రా లిప్‌లాక్ ఇచ్చింది. ఆ తతంగాన్ని దూరంగాఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో షూట్ చేసి, సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశాడు.ఆ యువకుడు చేసిన పనికి ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.
వీడికి ఇదేం పోయేకాలం అని కొందరంటున్నారు. ఆ డబ్బులతో హాయిగా రిజర్వేషన్ చేసుకుని రావచ్చని కొందరంటున్నారు. అలా వస్తే హిజ్రాలు ఎలా బతుకుతారని ఇంకొందరి ప్రశ్న. కేవలం రోజున్నర వ్యవధిలో ఆ వీడియోను దాదాపు నాలుగు లక్షల మంది తిలకించారు. ఇప్పుడు ఈ వీడియోపై ఓ లుక్కేద్దాం.
I am speechless pic.twitter.com/8sFAmwurxF
— desi mojito (@desimojito) October 14, 2025