Brahmamudi serial today Episode: మహిళా సంఘాల నుంచి వచ్చిన వ్యక్తులు రాజ్‌ను తిడుతుంటే.. రుద్రాని వచ్చి వాళ్లను మరింత రెచ్చగొడుతుంది. దీంతో ఇంద్రాదేవి కాసేపు నువ్వు నోరు మూస్తావా..? అని చెప్పినా రుద్రాణి వినకుండా అసలు మీరు నా మేనల్లుడు అంటే ఎవరనుకున్నారు..? అసలు ఏం చేయగలరు మీరు అంటూ మరింత రెచ్చగొడుతుంది. దీంతో ఆ వ్యక్తులు మీ మేనలుడి గురించి మేము ఏమీ అనుకోవడం లేదు.. కానీ ఒక అడపిల్లను ఇబ్బంది పెడుతున్నాడని.. బిడ్డను చంపుకోమంటున్నాడని మేము పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టామంటే చాలు మీరందరూ వెళ్లి జైళ్లో కూర్చుంటారు అంటారు. దీంతో రుద్రాణి ఏంటి బెదిరిస్తున్నారా అంటుంది.
దీంతో ఆ మహిళలు మేము ఇక్కడికి వచ్చే వరకు రాజ్ చెస్తున్నది తప్పు.. తన తప్పును సరిదిద్దుకోమని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు చూశాక మీ అందరినీ చట్ట పరంగా శిక్షించడం కరెక్టు అని మాకు అనిపిస్తుంది అని బెదిరించగానే.. మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మేము పోలీస్ స్టేషన్‌కు వెళ్తాము చట్టాలేవీ మాకు కొత్త కాదు అంటూ రుద్రాణి మాట్లాడుతుంటే అపర్ణ కోపంగా రుద్రాణి ఇక నువ్వు అపుతావా…? వాళ్లు ఆవేశంగా మాట్లాడుతుంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావేంటి..? ఇక ఆపు చూడండి తను ఏదో తెలియక మాట్లాడింది. తనకు కొంచెం ఆవేశం ఎక్కువ మీరు అనుకున్నట్టుగా మా అబ్బాయి మా కోడలిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నిజం చెప్పాలంటే… తనను మేము ఒక కూతురులా చూసుకుంటుంన్నాము అని అపర్ణ చెప్పగానే..
మీరు ఇలా మాట్లాడి అబద్దం చెప్పినంత మాత్రాన మీ మాటలను మేము నమ్ముతామని మీరు ఎలా అనుకుంటున్నారు.. చేయాల్సిన తప్పు చేశారు. సరిదిద్దడానికి వచ్చిన మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు.. మీకు డబ్బు పేరు పలుకుబడి ఉండొచ్చు కానీ మా వైపు న్యాయం ఉంది. మీరు మీ కోడలికి చేసిన అన్యాయాన్ని మేము బయట పెడతాం. మీ కొడుకు చేసిన తప్పుకు సరైన శిక్ష విధిస్తాం.. అని మాట్లాడుతుండగానే.. కావ్య వస్తుంది. ఒక్క నిమిషం అంటూ లోపలికి వచ్చి చూడండి మీలాంటి మహిళలు అందరూ కలిసి ఒక శక్తిగా మారి అన్యాయానికి గురౌతున్న అడవాళ్లకు అండగా నిలబడుతున్నారు. ఆ విషయంలో మిమ్మల్ని నేను కూడా స్పూర్తిగా తీసుకుంటున్నాను.. మీ వల్ల ఎంతో మంది అడవాళ్లు వాళ్లు పడుతున్న బాధల నుంచి బయట పడ్డారు. వారికి మరో కొత్త జీవితాన్నిఇచ్చారు మీ అందరూ కలిసి ఆ విషయంలో నేను మీ అందరినీ మొచ్చుకుంటున్నాను.. కానీ నా విషయంలో ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు.. అని చెప్పగానే..
మరి మీరు పుట్టింటికి ఎందుకు అలిగి వెళ్లిపోయారు అని అడగ్గానే.. భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న గొడవలు వస్తుంటాయి. మీరే చెప్పండి మీరు ఇక్కడికి వచ్చారు అని తెలియగానే.. నేను ఎందుకు వస్తాను మీరు అందరూ నాకోసం వచ్చినందుకు చాలా థాంక్స్ అని కావ్య చెప్పగానే వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక రుద్రాని వెటకారంగా వావ్ ఎంత బాగా నాటకం ఆడుతున్నావు కావ్య.. నీ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాను. వాళ్లకు నువ్వే సమాచారం ఇచ్చి ఇక్కడ గొడవ జరిగేలా చేసి రాజ్‌తో పాటు మమ్మల్ని అందరినీ నీ దారికి తెచ్చుకోవాలి అనుకున్నావు కదా అంటుంది. అలా చేయాలి అంటే నేను పుట్టింటి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు రుద్రాణి గారు ఇక్కడే ఉండి కూడా చేయగలను.. ఈ పని నేను చేయలేదని మీకు తప్పా ఇంట్లో అందరికీ తెలుసు.. నేను ఇక్కడికి వచ్చి మీ తరపున మాట్లాడినంత మాత్రాన మీ నిర్ణయానికి నేను అంగీకరించినట్టు అని మాత్రం అనుకోకండి.. ఈ ఇల్లు ఎప్పటికీ నా అత్తారిల్లే.. ఈ ఇంటికి సమస్య వచ్చిందంటే ఎప్పుడైనా వస్తాను ఇలాగే మాట్లాడతాను అని కావ్య చెప్తుంది. తర్వాత కావ్య వెల్లిపోతుంటే ఇక్కడే ఉండొచ్చు కదా అని స్వప్న అడగ్గానే ఉండలేనని వెళ్లిపోతుంది కావ్య.
తర్వాత రూంలోకి వెళ్లి రుద్రాణి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. దీంతో ఎప్పుడూ గెలిచే వాళ్లు ఓడిపోతే ఫీల్ అవ్వాలి కానీ నువ్వెందుకు బాధపడాలి అంటూ ఓదారుస్తాడు. తర్వాత రాజ్‌ను పిలిచి భార్యాభర్తలు ఎలా ఉండాలో రాజ్ కు చెప్తాడు. దీంతో రాజ్ సరే తాతయ్య అంటూ వెళ్లిపోతాడు. రూంలోకి వెళ్లిన రాజ్ దగ్గరకు రుద్రాణి వెళ్లి కావ్యకు విడాకులు ఇస్తానని డ్రామా ప్లే చేయ్ అంటూ రెచ్చగొడుతుంది. దీంతో తర్వాతి రోజు రాజ్ కనకం ఇంటికి వెళ్లి కావ్యతో గొడవ పడతాడు. దీంతో మూర్తి ఎమోషనల్ అవుతాడు. ఇంతలో రాజ్ విడాకుల పేపర్స్ తీసి సంతకం పెట్టమని కావ్యను అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.