YouTuber:టెక్నాలజీ మారుతున్నా.. మత కల్లోలాలు ఎప్పటికప్పుడు విధ్వంషశాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మా మతంలోకి చేరంటే.. మా మతంలోకి చేరమంటూ కొంతమందిని.. మరికొంతమంది మత పిచ్చొళ్ళు ఇతర మతస్తులను చిత్రవధకు గురి చేస్తున్నారు అంటూ ఇప్పటికే ఎంతోమంది బాధితులు తమ గోడును వెల్లబుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా యూట్యూబర్ రామ్ కి కూడా ఇలాంటి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. మొన్నటి వరకు విదేశాలలో సైకిల్ యాత్ర చేసి అందరిని అలరించిన రామ్ అనే తెలుగు ట్రావెల్ యూట్యూబర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో కూడా సైకిల్ పై పర్యటిస్తున్నారు.
అర్ధరాత్రి యూట్యూబర్ కి కొత్త చిక్కులు…
ఇక ఎప్పటిలాగే గత నెలలో నెల్లూరులో ప్రారంభించిన తన సైకిల్ యాత్ర.. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే చిత్తూరు జిల్లాలో రామ్ అర్ధరాత్రులు కూడా సైకిల్ తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ కి ఊహించని పరిణామం ఎదురవడంతో రామ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తనకు ఎదురైన ఆ అనుభవానికి సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రామ్ సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంటే.. ఒక వ్యక్తి రామ్ ను మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలోనే రామ్ కూడా బైక్ పైన వచ్చిన సదరు వ్యక్తితో చాలా చక్కగా మాట్లాడటం మనం ఆ వీడియోలో చూడవచ్చు.
తమ మతంలోకి మారాలంటూ టార్చర్..
అయితే ఆ వ్యక్తి ఇంతలోనే ఏపీలోని ఒక ప్రముఖ మతంలో చేరాలని, యూట్యూబర్ రామ్ ను కోరారు. దానికి యూట్యూబర్ మాత్రం జైశ్రీరామ్ అను అంటూ ఆ బైక్ పైన ఉన్న వ్యక్తిని ఉద్దేశించి కౌంటర్ వెయ్యగా.. అక్కడ నుంచి ఆ ప్రముఖ మతానికి సంబంధించిన వ్యక్తి వెళ్లిపోయాడు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన తెలుగు ప్రజలు మాత్రం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి కూడా మత ప్రచారాలు ఏంట్రా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా వీడియోలో రామ్ అన్ని మతాలను ఉచ్చరిస్తూ కామెంట్లు చేయగా.. అతడు మాత్రం ఆ మతాన్ని తప్ప మిగతా మతాలను ఉచ్చరించకపోవడం ఇక్కడ ఆశ్చర్యంగా మారింది. అన్ని మతాలు ఒకటే.. అందరూ ఒకటే అని కొంతమంది ప్రచారం చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఇలాంటి మత ప్రచారాలు చేస్తూ.. కల్లోలాలకు కారణమవుతున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా యూట్యూబర్ రామ్ కి అర్ధరాత్రి ఇలా మత ప్రచారాలకు సంబంధించిన చిక్కులు ఎదురవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే యూట్యూబర్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఇలా సైక్లింగ్ చేస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ట్రావెలర్ గా కూడా పేరు సొంతం చేసుకున్న రామ్ ఎప్పుడూ కూడా ఇలాంటి అనుభూతిని పొందలేదని, కానీ ఇప్పుడు ఏపీలో అందులోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి.
మతం మార్చుకో అని అంటున్నాడు 😡 ||[ig: Ram The Traveller]
12 AM midnight appudu kuda మత ప్రచారం chestunnaru hallelujah ani cheppi appudu jai shree ram ani ee influencer adagaga nenu cheppanu ani antunna gorre.
Em cheyyali ilanti మత పిచోళ్ళని pic.twitter.com/UoSkII4AK2— Areyy Ryan 🚩 (@areyysun) April 15, 2025