BigTV English

KA Paul : 100 మంది పాస్టర్లు టార్గెట్.. ప్రవీణ్ కేసులో కేఏ పాల్ సంచలనం

KA Paul : 100 మంది పాస్టర్లు టార్గెట్.. ప్రవీణ్ కేసులో కేఏ పాల్ సంచలనం

KA Paul : కేఏ పాల్ మళ్లీ వేసేశాడు. ఆ వీడియోలో ఉన్నది అసలు ప్రవీణ్ కాదని.. డూప్ ప్రవీణ్ అని అన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటపెట్టకుండా.. ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ చేస్తారని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో కానీ, సీబీఐతో కానీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 24 ఏళ్లుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటే లేదన్నారు కేఏ పాల్. ఇంకా ఆయన ఏమన్నారంటే…


ప్రవీణ్‌కు మద్యం అలవాటు లేదు..

ఈ దుర్మార్గులు ప్రవీణ్‌ను తాగుబోతుగా చిత్రీకరించారని కేఏ పాల్ పోలీసులపై మండిపడ్డారు. ప్రవీణ్ తాగేసి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చెయ్యలేదంటూ లాజిక్ పాయింట్ బయటకు తీశారు పాల్. 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని నిలదీశారు. ఘటనకు ముందు ప్రవీణ్‌కు చాలా బెదిరింపులు వచ్చాయని.. ఆ బెదిరింపుల గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదని పాల్ ప్రశ్నించారు.


ట్రంప్‌తో చెబుతా.. పాల్ వార్నింగ్

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి ఎస్పీతో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారని కేఏ పాల్ అడిగారు. రాష్ట్రంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారని అనుమానం వ్యక్తం చేశారు. మరో 100 మంది పాస్టర్‌లను టార్గెట్ చేసినట్టు తనకు సమాచారం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు కేఏ పాల్. ఈ విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ కేసును తీసుకెళ్తానని అన్నారు.

ప్రధానికి ఫిర్యాదు చేస్తా..

సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ ప్రవీణ్ కేసును విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వద్దంటే.. ఏదో కుట్ర ఉందన్నట్టే అని అన్నారు. అవసరమైతే ప్రవీణ్ కేసుపై తాను ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రవీణ్ భార్య ఇప్పుడు ఎక్కడ ఉందని? ఆమె మాట్లాడకుండా ఎవరు కంట్రోల్ చేస్తున్నారని కేఏ పాల్ ప్రశ్నించారు.

Also Read : లోకేశ్‌ను ఫాలో అవుతున్న కవితక్క.. ఏంటి సంగతి?

పాల్‌కు అసలేమైంది? 

కేఏ పాల్. ఆయనో వెరైటీ మనిషి. లాజిక్కులంటూ మేజిక్కుగా మాట్లాడుతాడు. అంతా సొంతడబ్బానే. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో మరోసారి ఎంట్రీ ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌పై అనేక డౌట్స్ వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్‌లో ప్రవీణ్ మద్యం కొన్నట్టు రికార్డింగ్స్ ఉన్నా.. ఆ మద్యం కొన్నది ప్రవీణే కాదని వాదిస్తున్నారు. ఆయనకసలు తాగుడు అలవాటే లేదంటున్నారు. అక్కడితో ఆగిపోతే బాగుండేదేమో. కానీ, మరో 100 మంది పాస్టర్లను టార్గెట్ చేసినట్టు తన దగ్గర సమాచారం ఉందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. క్రిస్టియన్ యువకులు కోపంతో రగిలిపోతున్నారంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం మంట రేపుతోంది. మోదీకి చెబుతా, ట్రంప్‌కు చెబుతా.. సీబీఐ ఎంక్వైరీ కావాలి.. ఎఫ్బీఐతో విచారణ చేపించాలి.. అంటూ ఏదేదో మాట్లాడుతూ.. సీరియస్ కేసులో కామెడీగా మాట్లాడితే ఎలా అనే వివర్శలు వస్తున్నాయి. ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వండంటూ ఇప్పటికే డిపార్ట్‌మెంట్ పిలుపు ఇచ్చింది. మరి, పాల్ దగ్గరున్న ఆ సమాచారం ఏదో పోలీసులకు ఇవ్వొచ్చుగా?

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×