Ananya Panday: ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒక్క నెపో కిడ్‌కు కూడా సినిమాల విషయంలో అదృష్టం కలిసి రావడం లేదు. వారు నటిస్తున్న సినిమాలు చాలావరకు ఫ్లాప్ టాక్‌నే అందుకుంటున్నాయి. ఒకవేళ సినిమాలు హిట్ అయినా కూడా అందులో వారి నటన గురించి మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి. అలా ప్రస్తుతం బీ టౌన్‌లో ప్రేక్షకులకు నెపో కిడ్స్ పట్ల నెగిటివ్ అభిప్రాయమే ఉంది. అలాంటి వారిలో అనన్య పాండే కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అనన్య. తన ఆన్ స్క్రీన్ యాక్టింగ్‌తో మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్‌తో కూడా ఎన్నోసార్లు ట్రోల్స్ ఎదుర్కుంది. అలాంటి అనన్యకు తాజాగా ఒక అరుదైన ఘనత దక్కింది.
స్టైలిష్ ఐకాన్
అనన్య పాండే యాటిట్యూడ్, యాక్టింగ్ ఎలా ఉన్నా తన ఫ్యాషన్ సెన్స్‌కు మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తనకు సూట్ అయ్యే దుస్తులు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో ఎప్పుడూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఉంటుంది ఈ యంగ్ బ్యూటీ. అందుకే ఒక ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్ సైతం ఏరికోరి అనన్య పాండేను తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది. ఇండియాలో ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్స్‌ను ఉపయోగిస్తున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. కానీ వారిలో కొందరికి మాత్రమే ఈ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో అనన్య పాండే కూడా జాయిన్ అవ్వడంతో తనకు లక్ కలిసొచ్చిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ రేంజ్
ఫ్రెంచ్ దేశానికి చెందిన లగ్జరీ బ్రాండ్ అయిన ‘ఛానెల్’.. తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా అనన్య పాండేను ఎంపిక చేసింది. అయితే ఛానెల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ అయిన మొదటి ఇండియన్‌గా అనన్య పాండే రికార్డ్ సాధించింది. నటిగా తనకు లక్ కలిసి రాకపోయినా ఈ విషయంలో మాత్రం తను ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి సిద్ధమయ్యిందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. తను ఛానెల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం పర్ఫెక్ట్ అని యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. 2025లో పారిస్‌లో జరిగిన ఒక షోలో ఛానెల్ బ్రాండ్‌ను ధరించి కనిపించింది అనన్య. అప్పటినుండి తను బ్రాండ్ అంబాసిడర్ అవుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఫైనల్‌గా దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
Also Read: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. ఎట్టకేలకు కోరికను బయటపెట్టిన పూజా హెగ్డే
ఎంతోమంది స్టార్లు
ఛానెల్ మాత్రమే కాదు.. అనన్య పాండే ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది. అంతే కాకుండా పలు ఫ్యాషన్ బ్రాండ్‌కు తను బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ నుండి అనన్య పాండే (Ananya Panday) మాత్రమే కాదు.. దీపికా పదుకొనె, ఆలియా భట్, ఐశ్వర్య రాయ్, సోనమ్ కపూర్ లాంటి సీనియర్ హీరోయిన్స్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్స్‌గా పనిచేస్తూ సత్తా చాటుతున్నారు. ఇక అనన్య పాండే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తాజాగా అక్షయ్ కుమార్‌తో తను కలిసి నటించిన ‘కేసరి 2’ విడుదలకు సిద్ధమయ్యింది.